శృంగారంపై ఆసక్తి తగ్గిపోవడానికి కారణాలు ఇవే.. (video)

బుధవారం, 4 జులై 2018 (12:30 IST)

హడావుడి, యాంత్రిక జీవనంతో తీరికలేని పనుల వల్ల అలసిపోవడం కారణంగా స్త్రీపురుషుల్లో శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుందని వైద్యులు చెప్తున్నారు. అందుకే తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ధ చూపాలని వారు సూచిస్తున్నారు. ప్రొటీన్లు పుష్కలంగా లభించే గుడ్లును రోజూ తీసుకుంటే అలసట దూరమవుతుంది. కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి తోడ్పడతాయి. అలాగే స్ట్రాబెర్రీ గింజల్లో జింక్ ఎక్కువ వుంటుంది. 
 
వీర్యం ఉత్పత్తికి అవసరమైన పురుష హార్మోన్ టెస్టోస్టీరాన్‌ను జింక్ నియంత్రిస్తుంది. లైంగిక కోరికల ఉద్దీపన కలుగజేస్తుంది. అలాగే రోజుకు రెండు కప్పుల కాఫీ తాగితే శృంగారంపై ఆసక్తిని పెంచుకోవచ్చు. కాఫీలోని కెఫైన్‌ మెటబాలిజాన్ని మెరుగు పరుస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి ఫ్యాట్ స్టోర్స్‌ను విడుదల చేస్తుంది. తద్వారా శృంగారం ఆసక్తి పెరుగుతుంది.  
 
బాదం, జీడిపప్పు, అక్రోట్స్ లాంటి నట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వీటిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే సెలీనియం, జింక్‌తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. పోషకాహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేస్తూ ఒత్తిడికి దూరంగా వుండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.



దీనిపై మరింత చదవండి :  
శృంగారం స్ట్రాబెర్రీ జింక్ కాఫీ బాదం జీడిపప్పు ఆక్రోట్స్ Food Romance Life Badam Cashew Coffee Egg

Loading comments ...

ఆరోగ్యం

news

సోయాబీన్ ఆరోగ్య విషయాలు....

సోయాబీన్‌ను పూర్ణ ఆహారంగా ఆరోగ్య నిపుణులు గుర్తించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు ...

news

ప్రతిరోజూ కరివేపాకు పొడిని తీసుకుంటే?

కరివేపాకు చెట్టులో ఆకులు, బెరడు, వేరు, గింజలు ఔషధగుణాలు కలిగిఉన్నాయి. కరివేపాకు పేగులకు, ...

news

వాము రసంలో కొంచెం పసుపు, తేనె కలిపి తీసుకుంటే..?

వాము మంచి ఔషధపు మెుక్క. దీని వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణ సంబంధ ...

news

ముఖానికి బాదం పప్పుల పేస్టును రాస్తే?

చర్మసౌందర్య సాధనాలలో బాదంను విరివిగా వాడుతారు. చర్మకాంతిని సంతరించుకోవాలంటే.. రాత్రి ...