మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 30 జూన్ 2018 (12:58 IST)

భక్తి భావంలోని సిద్ధాంతాలేంటో తెలుసా?

భక్తిని పెంపొందించేందుకు భక్తి మార్గాన్ని అవలంభించేందుకు సిద్ధాంతాలు. పరమేశ్వరుడే యావత్ ప్రపంచానికి ప్రభువు, అణువణువున వ్యాపించిన అనంతుడు ఈశ్వరుడే. మనిషి-పశువు అనే భేదం లేకుండా ఈ చరాచర ప్రపంచమంతా ఆ మహా పవిత్రుడైన ఈశ్వర అద్భుతాలతో నిండి ఉంది.

సంపూర్ణుడైన పరమేశ్వరుడు సృష్టించిన ఈ జగత్తులో సుఖము, సౌందర్యమే నిండి ఉంది. ఈ విశ్వాసాన్ని మనస్సు అనుసరించినప్పుడు ప్రపంచం అతి సుందరంగా కనబడుతుంది. భగవంతుడు ఏది అందిస్తే దానితో తృప్తి చెంది భగవంతుడికి ఎల్లవేళలా దాసులై మెలగాలి. కష్టాలు, దుఃఖాలుగా భావించేవేవి నిజమైన కష్టాలు కావు. 
 
మనస్సును బాధపెట్టడం కంటే మించిన పాపం లేదు. ఇతరుల ప్రసన్నతను, సంతోషాన్ని సహించి పంచుకోవడమే పరమధర్మం. నేను, నాది అనే అహం విడచి ఈ సమస్తం భగవంతుడిదే అనే భావాన్ని పరిపూర్ణంగా పొందేందుకు సద్గురువును ఆశ్రయించాలి. తత్ఫలితంగా భగవంతునిలో ఐక్యమయ్యే ఆదర్శ సూత్రాలు అలవడుతాయి.