శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : బుధవారం, 24 జులై 2019 (18:49 IST)

సంభోగం తర్వాత ఇలా చేస్తున్నారా? లేదా?

శారీక సుఖం అనేది స్త్రీపురుషుల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసికోల్లాన్ని పెంచుకుంది. చలాకీగా ఉండేలా చేస్తుంది. అయితే, అనేక మంది యువతీ యువకులు శారీరకంగా కలిసిన తర్వాత శుభ్రతను పాటించరు. ఫలితంగా వివిధ రకాల వ్యాధులబారినపడుతుంటారు. ముఖ్యంగా స్త్రీపురుషుల సంభోగంలో ప్రతి దశా కీలకమైనదే. బాహ్యరతితో పాటు ముద్దులూముచ్చట్లూ, చిలిపిచేష్టలూ ఇలా ప్రతిదీ కీలకమైనదే. అంటే స్పర్శ నుంచి సంభోగం వరకు కీలకమైన ఘట్టాలే.
 
అయితే, యువతీయువకులు శారీరకంగా కలుసుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారే.. సంభోగం తర్వాత కూడా పరిశుభ్రతకు అంతే ప్రాధాన్యత ఇవాల్సి ఉంటుంది. అలాచేయడం వల్ల మానసిక, శారీరక జీవితమంతా సంతోషంగా ఉండొచ్చు. ఇందుకోసం శృంగారానికి ముందు... శృంగారం తర్వాత కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
ముఖ్యంగా, సంభోగం ముగిసిన తర్వాత స్త్రీపురుషులు తప్పనిసరిగా తమ జననాంగాలను సబ్బుతో శుభ్రం చేసుకుని, ఆ ప్రాంతాన్ని పొడి గుడ్డతో తుడవాలని సలహా ఇస్తున్నారు. అలాగే, స్త్రీపురుషులు ఖచ్చితంగా మూత్రవిసర్జన చేయాలని, లేనిపక్షంలో మూత్ర సంబంధిత వ్యాధులు సోకుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
కొంతమంది మహిళలు లేదా కొత్తగా పెళ్లయిన యువతులు... శృంగారం తర్వాత మూత్రం వచ్చినప్పటికీ పడకపై నుంచి దిగరు. అంటే మూత్రాన్ని బిగపట్టేస్తారు. ఇలా చేయడం వల్ల యురెత్రా నుంచి విడుదలయ్యే బ్యాక్టీరియా బ్లాడర్‌లోకి చేరుతుంది. దీనివల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. 
 
వేశ్య లేదా తమకు నచ్చిన అమ్మాయి లేదా భార్యతో శృంగారం పాల్గొనే సమయంలో కండోమ్ ధరించి సంభోగంలో పాల్గొన్నప్పటికీ.. రతి ముగిసిన తర్వాత జననాంగాలను శుభ్రం చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. అయితే, జననాంగాలను మాత్రం రసాయనాలతో తయారు చేసిన సబ్బులు లేదా డేటాల్ వంటివాటితో శుభ్రం చేయరాదని సలహా ఇస్తున్నారు.