శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : శుక్రవారం, 11 జనవరి 2019 (14:25 IST)

పురుషత్వం లేదు.. విడాకులు ఇవ్వడట.. ఆ పని చేసినా అడ్డుచెప్పడట...

నా పేరు సుజాత. హైదరాబాద్‌లో నివశిస్తున్నా. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. ఇంటిపక్క వాళ్ళ సూచన మేరకు రెండు నెలల క్రితం ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నా. వివాహం బాగానే జరిగింది. శోభనం రోజు రాత్రి.. పక్కలో కూర్చొని "నాకు పురుషత్వం లేదు. ఆ విషయం బయటకు చెప్తే సమాజంలో అవమానం పాలవుతానని భయపడి చెప్పలేదు. ఇపుడు నిన్ను పెళ్లి చేసుకున్నా. నేను నిన్ను సుఖపెట్టలేను. కానీ, నీ లైంగిక సుఖానికి మాత్రం నేను అడ్డురాను. ఎవరితో ఎంజాయ్ చేసినా నాకు అభ్యంతరం లేదు. పైగా, పిల్లలను కూడా కనొచ్చు. కానీ, విడాకులు మాత్రం ఇవ్వను" అన్నాడు. ఈ మాటలు విన్న తాను షాక్‌కు గురయ్యాను. మౌనంగా ఉండిపోయానేగానీ ఏం మాట్లాడలేదు. ఇపుడు నా పరిస్థితి ఏంటి. విడాకులు తీసుకునే మార్గముందా? నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
 
ఇది ముమ్మాటికీ మోసపూరిత వివాహమే. నిజాలను దాచి చేసుకునే వివాహాలను చెల్లకూడని వివాహాలు అంటారు. ఇలాంటి పెళ్లిళ్ళ విషయంలో విడాకుల కోసం ఎక్కువ రోజులు ఆగాల్సిన అవసరం లేదు. భార్యాభార్తలిద్దరూ సంయుక్తంగా సిద్ధమైన కేసులోనే ఆర్నెల్లపాటు ఆగాల్సిన పరిస్థితి ఉంది. 
 
కానీ, నపుంసకత్వంవంటి కారణాలు ఉన్నపుడు మరుసటి రోజే విడాకులు కోసం వెళ్లే వెసులుబాటును చట్టం కల్పించింది. అందువల్ల జిల్లా ఫ్యామిలీ కోర్టులో హిందూ వివాహ చట్టంలోని 12వ సెక్షన్ ఆధారంగా విడాకుల కోసం కేసు వేయవచ్చు. అపుడు తన నపుంసకత్వాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన పక్షంలో వైద్య పరీక్షలు చేయించక తప్పదు. అతను చేసిన మోసానికి ఏడేళ్ళ జైలుశిక్ష కూడా పడుతుంది. మనోవర్తి కూడా పొందవచ్చు.