సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 10 జనవరి 2019 (13:58 IST)

అమెజాన్ ఫౌండర్‌కు అక్రమ సంబంధం.. విడాకులు ఇవ్వనున్న భార్య

అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయిన జెఫ్ బెజోస్‌కు పరాయి మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో తన భర్తకు విడాకులు ఇవ్వాలని బెజోస్ భార్య మెకంజీ బెజోస్ నిర్ణయించుకున్నారు. ఫలితంగా బెజోస్ దంపతలు 25 యేళ్ళ వైవాహిక బంధం తెగిపోనుంది. 
 
అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌కు హాలీవుడ్ టాలెంట్ ఏజెంట్ పాట్రిక్ వైట్‌సెల్ భార్య లారెన్ సాంచెజ్‌తో అక్రమ సంబంధం ఉన్నట్టు మెకాంజీ బెజోస్ బలంగా నమ్మింది. దీంతో తన భర్తకు విడాకులు ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఎక్వైరర్ అనే సీక్రెట్ ఏజెన్సీ బెజోస్, సాంచెజ్‌లపై గత 8 నెలలుగా నిఘా పెట్టింది. వారిద్దరిని వెంటాడుతూ 5 రాష్ట్రాల్లో 40 వేల మైళ్ళు ప్రయాణం చేసింది. వాళ్లు ప్రైవేట్ జెట్స్‌లో తిరగడం, ఫైవ్‌స్టార్ హోటళ్లలో రహస్యంగా గడపడం, డిన్నర్ డేట్స్‌కు వెళ్లడంలాంటి విషయాలను బయటపెట్టింది. 
 
కాగా, జెఫ్ బెజోస్, మెకంజీలకు నలుగురు పిల్లలు ఉన్నారు. తన సక్సెస్‌కు తన భార్యే కారణమని బెజోస్ పదే పదే చెబుతుంటారు. అలాంటిది ఇద్దరూ విడాకులు తీసుకోవడం ఏంటని చాలా మంది ఆశ్చర్యపోయారు.