బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 1 అక్టోబరు 2018 (19:15 IST)

తొలి కలయిక మధురంగా ఉండాలంటారు... కానీ ఒప్పుకోరు...

పెళ్లయ్యాక కొత్తజంట శృంగారంలో అనేగ సమస్యలను ఎదుర్కొంటూ వుంటారు. ఇదివరకు ఉమ్మడి కుటుంబాల్లో అయితే ఈ వ్యవహారాన్ని చక్కగా విడమర్చి చెప్పే పెద్దలు వుండేవారు.

పెళ్లయ్యాక కొత్తజంట శృంగారంలో అనేగ సమస్యలను ఎదుర్కొంటూ వుంటారు. ఇదివరకు ఉమ్మడి కుటుంబాల్లో అయితే ఈ వ్యవహారాన్ని చక్కగా విడమర్చి చెప్పే పెద్దలు వుండేవారు. ఇప్పుడంతా చిన్న కుటుంబాలు. పెళ్లవగానే భార్యాభర్త వేరు కాపురాలు పెట్టేస్తున్నారు. ఇక అలా వెళ్లిపోయిన తర్వాత వారి జీవితంలో తలెత్తే సమస్యలు వారికి వారే పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక శృంగార విషయాలలో అయితే మరీ దారుణంగా వుంటుంది పరిస్థితి.
 
పెళ్లయ్యాక కొంతమంది అమ్మాయిల్లో శృంగారం పట్ల భయం వుంటుంది. దీన్ని తప్పించుకునేందుకు భర్తకు ఏదో ఒక సాకు చెప్పేస్తుంటారు. అలాంటివాటిలో ఇది కూడా ఒకటి అని చెపుతున్నారు నిపుణులు. శృంగార కలయిక మధురంగా వుండాలని దాన్ని దాటవేస్తూ సమయం గడిపేస్తుంటారనీ, అడిగినపుడల్లా అలా చెబితే భర్త కూడా ఆ క్షణం కోసం ఎదురుచూస్తూ వుంటాడు కాబట్టి సమస్య వుండదని అనుకుంటారు. కానీ పోనుపోను అదే పెద్ద సమస్యయి కూర్చుంటుంది. కాబట్టి పెళ్లయిన జంటలు శృంగారం విషయంలో పెద్దల్ని కానీ లేదంటే నిపుణలైనవారిని కాని అడిగి తమ సమస్యలను నివృత్తి చేసుకోవాలి.