ఈ వయస్సు వారు అన్నిసార్లు శృంగారంలో పాల్గొంటే.. ఆ జబ్బులు రావట
సాధారణంగా శృంగారమంటే భార్యాభర్తల ఇష్టాయిష్టాలు, మూడ్‌ను బట్టి ఉంటుంది. అయితే ప్రస్తుతమున్న బిజీ లైఫ్ కారణంగా శృంగారానికి సరైన సమయం కేటాయించడంలేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదయం వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి బాగా అలిసిపోవడం వల్ల శృంగారంపై ఆసక్తి కోల్పోతున్నారు. మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి రెగ్యులర్ శృంగారం చాలా అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి.
అలాగే జీవితంలో కూడా చాలా సంతోషాన్నిచ్చేది కూడా ఇదే. శృంగారం యాంటీ డెప్రండెంట్‌లా పనిచేస్తోంది. ఎందుకంటే ఇవి ఒత్తిడిని తగ్గించి రిలాక్సేషన్ ఇస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. స్కాటిస్ వైద్య బృందం చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయట.
మనుషుల వాళ్ళ వయస్సునుబట్టి ఎంతసేపు శృంగారంలో పాల్గొనాలో ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి. రెగ్యులర్ శృంగారం వల్ల మనిషి జీవితకాలం పెరుగుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అనేక వ్యాధులకు కారణమయ్యే ఒత్తిడిని శృంగారం తేలికగా అడ్డుకుంటుందట. కాబట్టి భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనేదాన్నిబట్టి వారి ఆరోగ్యం ఆధారపడి ఉంటుందట. 18 నుంచి 29 ఏళ్ల వయస్సున్న వారు సంవత్సరంలో కనీసం 109 సార్లు పాల్గొంటారట. అంటే నెలకు 10 సార్లయినా కలవాలట. 30 నుంచి 39 సంవత్సరాలలోపు ఉన్న వారు 80 నుంచి 86 సార్లు పాల్గొనాలట. అంటే నెలకు ఏడు నుంచి 8 సార్లు శృంగార జీవితంలో ఎంజాయ్ చేయాలట.
40 నుంచి 49 సంవత్సరాలు ఉన్న వాళ్ళు యావరేజ్‌గా 69 సార్లు శృంగారంలో పాల్గొనాలని అధ్యయనాలు చెబుతున్నాయి. యేడాదికి కొన్నిసార్లు మాత్రమే పాల్గొనేవాళ్ళు 13 శాతం ఉంటే 43 శాతం నెలకు అనేకసార్లు, 34 శాతంమంది వారానికి రెండు నుంచి మూడుసార్లు, ఏడు శాతం మంది యేడాదికి నాలుగు లేదా ఐదు సార్లు పాల్గొంటారట. ఇలా చేయడం కన్నా వారానికి మూడు నుంచి నాలుగుసార్లు పాల్గొంటే ఆరోగ్యమని అధ్యయనాలు చెబుతున్నాయి.