ప్రేమించాక తెలిసింది ఆమె నాకంటే పెద్దదని... పనికొస్తానా?

couple
Last Modified బుధవారం, 12 డిశెంబరు 2018 (18:09 IST)
ఆ అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడ్డాను. ఏడాది తర్వాత ఆమె బర్త్ సర్టిఫికేట్ చూస్తే ఆమె నాకంటే నాలుగేళ్లు పెద్దదని తెలిసింది. అప్పటి నుంచి నాకు డౌట్ వస్తోంది. మా ఇద్దరికి పెళ్లయ్యాక ఆమె నాతో శృంగారం తృప్తికరంగా అనుభవిస్తుందా...? నేను వయసులో చిన్నవాడిని కనుక ఆమెతో శృంగారంలో పాల్గొనేటపుడు సమర్థవంతంగా వుంటుందా అనే అనుమానాలతో పిచ్చెక్కిపోతోంది. ఆమె... పెళ్లాడదామంటూ గొడవ చేస్తోంది. ఈమధ్య ఓసారి శృంగారం చేయబోతే చమట్లు పట్టి నీళ్లుగారిపోయాను. వళ్లంతా తడిసి ముద్దయ్యింది. ఆమె నాకంటే వయసులో పెద్దది కావడం వల్లనే ఈ సమస్య ఎదురైందా అనే సందేహం వస్తోంది. ఏం చేయాలి?

మీకు, మీ గర్ల్ ఫ్రెండుకు మధ్య ఉన్న వయసు తేడా స్వల్పమైనదే. దాని గురించి వర్రీ చెందాల్సిన పనిలేదు. ప్రపంచంలో చాలాచోట్ల ఈ వయసు తేడా అనేది 10 నుంచి 15 వరకూ ఉన్నట్లు కూడా కొన్ని ఉదాహరణలు తేటతెల్లం చేస్తున్నాయి. ఓ సర్వే ప్రకారం భార్యలు కంటే భర్తలు రెండుమూడేళ్లు పెద్దవారుగా ఉన్నవారి శాతం 20 అని తేలింది.

అలాగే భార్య కంటే ఒక్క ఏడాది మాత్రమే అనేది 33 శాతం, ఇంకా భర్త కంటే భార్య రెండుమూడేళ్లు పెద్దదిగా ఉన్నవారి శాతం 6.5, భర్త కంటే భార్య 5 ఏళ్లు పెద్దదిగా ఉన్నవారి శాతం 3 శాతానికి పైగా ఉంది. దీన్నిబట్టి పెళ్లికి మీకు, మీ గర్ల్ ఫ్రెండుకు మధ్య ఉన్న వయసు తేడా సమస్య కాదు. ఇకపోతే... శృంగారం చేయబోతే వళ్లంతా చమట్లు పట్టడం అనేది మీలో గూడుకట్టుకున్న భయం, ఆందోళన. పైగా నాకంటే పెద్దదైన స్త్రీ అనే భావన. అదంతా వదిలేస్తే అంతా సజావుగానే వుంటుంది.దీనిపై మరింత చదవండి :