శృంగారంలో స్త్రీపై మగాడు ఆసక్తిని కోల్పవడానికి కారణం?

romance
Last Modified సోమవారం, 17 డిశెంబరు 2018 (12:24 IST)
కొంతమంది పురుషులు తమ భార్యలతో శృంగారం చేసేందుకు అయిష్టత వ్యక్తం చేస్తుంటారు. దీనికి కారణాలను పరిశీలిస్తే పడక గదిలో మహిళల ప్రవర్తనతో విసిగిపోయిన పురుషులు శృంగారం చేసేందుకు అయిష్టతను ప్రదర్శిస్తారని నిపుణులు చెపుతున్నారు.

అయితే, ఇలా ప్రవర్తించే భర్తలను భార్యలు సందేహిస్తుంటారు. తనపై ఇష్టాన్ని కోల్పోయాడని నిందిస్తుంటారు. మగాడు ఆసక్తి ప్రదర్శించకపోతే ఆమె అతనిపై అనుమానపడే అవకాశాలు లేకపోలేదు. మరో మహిళతో అతను సంబంధం పెట్టుకున్నాడేమోనని అనుమానిస్తుంది.

ఇలాంటి పరిస్థితుల్లో తాను ఆత్మపరిశీలన చేసుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. మహిళలు సరిగా ఆలోచించి, సృజనాత్మకతను, పద్ధతులను పాటించకపోవడం వల్ల పురుషుడు ఇష్టం కోల్పోయే అవకాశం లేకపోలేదు. రోటీన్ పద్ధతులు అతనికి విసుగు తెప్పించి, అది శృంగారం పట్ల విముఖతగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పురుషుడికి అయిష్టత కలిగిందని గుర్తించినప్పుడు తప్పు ఎక్కడ జరుగుతుందనే విషయాన్ని మహిళ గ్రహించి, తదనుగుణంగా నడుచుకోవాలని చెపుతున్నారు. పురుషుడు శృంగారానికి సిద్ధపడటం లేదంటే అది అసాధారణమేమీ కాదు. అతనికి మరో మహిళతో సంబంధం ఏర్పడిందనే అనుమానాలకు తావిచ్చి బంధాన్ని మరింత బలహీనం చేసుకోకుండా అసలు విషయాన్ని గుర్తించి, దాంపత్య జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని సలహా ఇస్తున్నారు.దీనిపై మరింత చదవండి :