నిద్ర లేపి శృంగారం చేస్తా... నన్ను చూడకుండా గోడను చూస్తోంది...

couple
Last Modified బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (17:50 IST)
ఇటీవలే పెళ్లయింది. వృత్తిరీత్యా నేను చాలా బిజీ. అందువల్ల రాత్రి బాగా పొద్దుపోయాక ఇంటికి చేరుకుంటాను. భోజనం ముగించేసరికి ఆమె నిద్రపోతుంటుంది. అయినా నిద్రలేపి శృంగారం చేస్తాను. ఒకవైపు నేను చేస్తుంటే ఆమె నన్ను చూడకుండా తల పక్కకు తిప్పి గోడను చూస్తుంటుంది. ఎందుకిలా చేస్తున్నావని అడిగితే ఏమీ లేదని అంటోంది. అసలామె ఎందుకిలా ప్రవర్తిస్తోంది. నాకు శృంగారం చేసిన తృప్తి కలుగడం లేదు...

ఏకంగా శృంగారం చేయడం మొదలుపెడితే మహిళలో స్పందన ఇలాగే కనబడుతుంది. ముఖ్యంగా మీరు చెప్పిన బిజీ షెడ్యూలును మార్చుకోండి. సంసారం కంటే ముఖ్యమైన షెడ్యూలు ఏదీ లేదని గ్రహించండి. అలాగని అంతా వదిలేయమని అర్థంకాదు. మీ పని సమయాన్ని కాస్త ముందుకు జరుపుకోండి.

అలాగే శృంగారం చేసేందుకు బెడ్రూంలోకి ప్రవేశించి నిద్రపోయే వారిని లేపి హఠాత్తుగా శృంగారం మొదలుపెడితే ఏమీ చేయలేక అలా గోడనే చూడాల్సి వస్తుందని మీరు చెప్పేదాన్ని బట్టి తెలుస్తుంది. శృంగారానికి ముందు ఫోర్ ప్లే చాలా ముఖ్యం. ఐతే చాలామంది శృంగారం కోసం ఆత్రపడుతూ ఫోర్ ప్లేను అలక్ష్యం చేస్తుంటారు. అది లేనపుడు ఇలాగే స్త్రీలో గోడ చూపులు కనబడుతుంటాయి మరి.దీనిపై మరింత చదవండి :