భార్యకు క్యాన్సర్.. వేరొక మహిళతో సంబంధాలు.. సొంత ఇంటికే కన్నం వేశాడు..

woman
Last Updated: బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (14:18 IST)
క్యాన్సర్‌తో బాధపడుతుందని తెలియగానే వేధింపులు మొదలెట్టాడు. అతని వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా కొన్నాళ్లు జైలులో గడిపారు. అంతే జైలు నుంచి విడుదలయ్యాక కక్ష్య పెంచుకున్న అతడు సొంత ఇంటికి కన్నం వేశాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. 47 ఏళ్ల మహిళకు 25 ఏళ్ల క్రితం సురేంద్ర సింగ్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. సురేంద్ర ఓ ప్రైవేటు సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే భార్యకు క్యాన్సర్ అని తెలియరావడంతో ఆమెను వేధింపులకు గురి చేశాడు. అతడి వేధింపులు తాళలేక భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా జైలుకెళ్లిన అతడు తిరిగి రావడంతో.. భార్య వుంటున్న సొంత ఇంటికే కన్నం వేశాడు. 
 
సురేంద్ర తన సోదరుడు శైలేంద్ర, స్నేహితుడు నితిన్‌తో కలిసి.. సొంతింట్లోని బంగారాన్ని కాజేశాడు. ఈ వ్యవహారంపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు క్యాన్సర్ వుందని తెలిశాక, సురేంద్ర వేరొక మహిళలతో గడుపుతున్నాడని.. ఆమెను పెళ్లాడేందుకే తన బంగారాన్ని కాజేశాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో వున్న సురేంద్ర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత చదవండి :