మొదటి భార్య కుమార్తెను హత్య చేసిన రెండో భార్య

murder1
సందీప్ రేవిళ్ళ| Last Modified బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (11:55 IST)
సవతి కూతురుపై ద్వేషం పెంచుకున్న మహిళ పసిపాపను దారుణంగా హత్య చేసింది. ఇందుకు గాను ఆమెకు కోర్టు మరణ శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే అయిదా బింట్ షామన్ అల్ రషీదీ అనే మహిళ ఇటీవల ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనికి ఇదివరకే భార్య, కూతురూ ఉన్నారు. మొదటి భార్య కూతురి పేరు రీమ్ బింట్ ఫరాగ్ (6).

పాపపై నిందితురాలు కక్ష కట్టింది. పథకం ప్రకారం హతమార్చాలని నిర్ణయించుకుంది. స్కూల్ నుండి అప్పుడే వచ్చిన పాపను తన వెంట తీసుకెళ్లి అయిదా కత్తితో పీక కోసి దారుణంగా చంపిందని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులకు కూతురు కనిపించకపోవడంతో అంతా వెతికారు. ఒక ప్రదేశంలో రక్తపు మరకలు కనిపించడంతో నిందితురాలిని అనుమానించి విచారించారు పోలీసులు. దాంతో ఆమె అసలు నిజం బయట పెట్టింది. సౌదీ కోర్టు ఆమెకు ఉరిశిక్ష వేయడమే కరెక్ట్ అని తీర్పు ఇచ్చింది.దీనిపై మరింత చదవండి :