శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (18:08 IST)

శృంగారం మొదలెట్టగానే నీళ్లుగారి తడిసిపోతుంది... ఎందుకలా?

మా వివాహమై ఐదేళ్లు అయింది. ఇప్పటి వరకు నా భార్యతో పరిపూర్ణంగా శృంగారంలో పాల్గొనలేదంటే నమ్మండి. ఆమెకు అదంటే అంతగా ఇష్టం ఉండదని అర్థమైంది. ఎప్పుడు పాల్గొన్నా కూడా మనస్ఫూర్తిగా సహకరించదు. ఏదో బలవంతం చేస్తున్నట్లు ఫీలవుతుంది. ఆ సమయంలో వింతవింతగా ప్రవర్తిస్తోంది. శృంగారం చేయడం మొదలుపెట్టగానే గట్టిగా ఏదో కొంపమునిగిపోయినట్లు కళ్లు మూసుకుంటుంది. 
 
ఆ సమయంలో ఆమె వళ్లంతా నీళ్లుగారిపోయి తడిసిపోతుంది. శృంగారం ముగిసిన తర్వాత కూడా పావుగంటపాటు కళ్లు తెరవకుండా అలా పడిపోయి వుంటుంది. ఆమె స్థితి చూసి నాకు భయం, ఆందోళనతో పాటు చికాకు కూడా వేస్తుంటుంది. ఈ విషయం బయటకు చెబితే నలుగురూ ఏమనుకుంటారోనని అలాగే లాక్కొస్తున్నాను. ఈమె ఎందుకిలా ప్రవర్తిస్తోంది. ఇదేమైనా జబ్బా? లేకపోతే శృంగారం అంటే చిరాకా? ఏంటి కారణం?
 
ఆమె ప్రవర్తిస్తున్న తీరును బట్టి చూస్తే ఆమెకు ఆ పరిజ్ఞానంపై పెద్దగా అవగాహన లేనట్టుగా కనిపిస్తోంది. అలాంటప్పుడు శృంగారాన్ని ఎవరూ కూడా ఎంజాయ్ చేయలేరు. ముఖ్యంగా ఆమె చిన్ననాటి నుంచి పెరిగిన వాతావరణం కూడా దాని పట్ల అయిష్టతకు ఒక కారణం కావొచ్చు. కుటుంబ కట్టుబాట్ల వల్ల పెళ్లీడు వచ్చేవరకు ఆ పరిజ్ఞానం రాదు. 
 
అలాంటి పరిస్థితులలో శృంగారమంటే వారిలో అంతర్గతంగా భయం, అపోహలు ఏర్పడవచ్చు. వీటిని తొలగించాలంటే స్నేహపూర్వకంగా మెలగాలి. శృంగారం ద్వారా పొందే ఆనందం గురించి విడమరచి చెప్పాలి. ఈ విషయాలను మీరు ఆమెకు చెప్పినట్లు లేరు. లేడికి లేచిందే పరుగు అని పరుగులెత్తితే ఇలాగే అవుతుంది. ఆమె ఒకవైపు జడుసుకుంటుంటే... దాని పరిష్కార మార్గం వెతక్కుండా మీ పని మీరు కానించేస్తున్నారు. కనుక ముందుగా ఆమెతో స్నేహపూర్వంగా మెలిగి కొన్నాళ్లు అవసరమైతే శృంగారానికి కాస్త విరామం ఇచ్చి చూడండి. ఖచ్చితంగా ఆమె సహకరిస్తుంది. మీ సమస్య పరిష్కారమవుతుంది.