మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (17:34 IST)

తామరకాడను బాలింతలు తీసుకుంటే..? (video)

తామరపూవు, తామర కాడలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆయుర్దాయం పెరగాలంటే.. తామర కాడ వేపుడును వారానికోసారి తీసుకుంటే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ఉడికించకుండా తామరకాడను నమిలి తీసుకునే వారిలో అనారోగ్య సమస్యలంటూ వుండవు.


ఈ మేరకు తాజాగా 66 రకాలకు చెందిన పండ్లను, కూరగాయలపై జరిపిన అధ్యయమంలో వృద్ధాప్య ఛాయలను రానీయకుండా నిరోధించే శక్తి తామరకాడల్లో పుష్కలంగా వుందని తేలింది. 
 
తామరకాడలోని తెల్లని భాగంలో పీచు పుష్కలంగా వుంటుంది. తామరకాడలు నీటిలోపల పెరగడం ద్వారా.. వాటిని అలాగే పచ్చిగా నమిలి తీసుకుంటే.. పొట్ట, రక్తంలోని వేడి తగ్గుతుందని చైనా ఆయుర్వేదం చెప్తోంది. ఇంకా దాహార్తి తగ్గుతుంది. మద్యం సేవించిన తర్వాత నోటిలో ఏర్పడే చేదును, రక్తవాంతులను తామర కాడ నిరోధిస్తుంది. 
 
తామరకాడను బాలింతలు తీసుకుంటే.. ప్రసవం సందర్భంగా మహిళల పొట్టలో వుండే మలినాలను తొలగించుకోవచ్చు. అందుకే తామరకాడను అలానే నమిలి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు.

ముఖ్యంగా మహిళలు తామరకాడను తీసుకుంటే.. గర్భసంచికి మేలు జరుగుతుంది. తామరకాడతో బెల్లాన్ని కలిపి తీసుకుంటే ప్రసవానికి అనంతరం మహిళల బొజ్జలోని మలినాలను తొలగిపోతాయని.. తద్వారా ప్రసవానికి అనంతరం మహిళల పొట్ట పెరగదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.