గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: గురువారం, 6 డిశెంబరు 2018 (18:25 IST)

ఇలా చేయడం ద్వారా స్త్రీ కోరుకున్నంతసేపు చేయవచ్చు...

పెళ్లికి ఇంకాస్త టైముంది. ఐతే అంతకంటే ముందే శృంగారంలో ఎంజాయ్ చేద్దామని ఇద్దరం అనుకున్నాం. ఆమె చాలా మోడ్రన్ గాళ్. పైగా శృంగారానికి సంబంధించి నిరభ్యంతరంగా ఎంజాయ్ చేయాలంటుంది. నాక్కూడా ఆమె అలా చెపుతుంటే ఎంతగానో నచ్చుతుంది. నాకు నచ్చినవిధంగా అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఆమెతో చేస్తున్నంతసేపూ చాలా ఆనందంగా ఉంటుంది. ఐతే ఇటీవల ఆమెకు కోర్కెలు విపరీతమయ్యాయి. కనీసం గంటసేపు కావాలని గొడవ చేస్తోంది. అంతసేపు సాధ్యం కావడం లేదు. ఎంతచేసినా అర్థగంటలోపే అయిపోతున్నా. గంటపాటు చేయాలంటే ఏం చేయాలి...? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి...?
 
గంటపాటు చేస్తూ ఉండటం అనేది చాలా అరుదైన విషయంగానే చెప్పాలి. ఏదో ఒక్కసారి సాధ్యమవుతుంది తప్ప ప్రతిసారీ అలా కావాలంటే సాధ్యం కాని విషయమే. ఐతే చేస్తున్న సమయంలో తృప్తి తారాస్థాయికి వచ్చినప్పుడు కొద్దిసేపు చేయడాన్ని ఆపి ఆ తర్వాత మళ్లీ మొదలెట్టాలి. ఇలా చేయడం ద్వారా స్త్రీ కోరుకున్నంతసేపు చేయవచ్చు.
 
ఇక ఆహారం విషయానికి వస్తే... బొప్పాయి, అరటిపండ్లు తింటుంటే అందులో ఉన్న పొటాషియం రక్తసరఫరాను మరింత వేగవంతం చేయడంతోపాటు శక్తిని అందిస్తాయి. అంతేకాదు, గింజ ధాన్యాలు, పాలు, వెన్న వంటివాటిలో జింక్ ఉంటుంది. ఇది శృంగార సామర్థ్యానికి సంబంధించిన హార్మోన్లను బాగా పెంచుతాయి. ఇంకా వెల్లుల్లి, పెద్దఉల్లిపాయలు కూడా రక్తసరఫరా మెరుగుదల చేస్తాయి.
 
ఐతే మధుమేహం వ్యాధి ఉన్నవారు తీపి పదార్థాల జోలికి వెళ్లరాదు. అలాగే అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నవారు ఆహారంలో ఉప్పు ఎక్కువగా లేకుండా చేసుకోవడం మంచిది. ఐతే ఏదయినా అపరిమితం అనేది సమస్యలను తెస్తుంది కనుక మితంగా వుంటేనే మంచిది.