Widgets Magazine

హాస్టల్స్‌లో రహస్య కెమెరాలు.. ఎలా కనిపెట్టారో తెలుసా?

hidden camera
Last Updated: మంగళవారం, 4 డిశెంబరు 2018 (16:53 IST)
ప్రైవేట్ హాస్టల్స్‌లో రహస్యంగా అమర్చిన కెమెరాలను.. స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా యువతులు కనుగొన్నారు. ప్రైవేట్ హాస్టల్స్‌లో బస చేస్తూ.. కాలేజీలకు, ఉద్యోగాలకు మహిళలు వెళ్తుంటారు. కానీ చెన్నై ఆదంబాక్కంలోని గంగానగర్‌ హాస్టల్‌ను నడిపే సంజీవ్‌పై ఆ హాస్టల్‌లో బస చేసే యువతులకు అనుమానం వచ్చింది. క్లీనింగ్ పేరిట కొందరు యువతుల గదులకు సంజీవ్ వెళ్లడం.. స్విచ్ బోర్డులను పరిశీలించడం వంటివి చేశాడు. అలా స్విచ్ బోర్డులకు, ఎలక్ట్రానిక్ వస్తువుల్లో కెమెరాలను వుంచేవాడు. 
 
ముఖ్యంగా పడకగది, రెస్ట్‌రూమ్‌లో ఇలా కెమెరాలను రహస్యంగా అమర్చేవాడు. కెమెరా డిటక్టర్ అనే యాప్ ద్వారా తమ గదుల్లో కెమెరాలు వుండటాన్ని యువతులు కనిపెట్టారు. దీనిపై గంగానగర్ హాస్టల్ యువతులు ఆ ప్రాంత పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి సంజీవ్‌పై ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంజీవ్‌ను అరెస్ట్ చేశారు. అతనివద్ద జరిపిన విచారణలో 2011 నుంచే సంజీవ్‌పై కేసులు నమోదైనట్లు తెలియవచ్చింది. ఇంకా అతని వద్ద 16 సెల్ ఫోన్లు, నకిలీ డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


దీనిపై మరింత చదవండి :