మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By మోహన్
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (18:53 IST)

శృంగార సమస్యలను దూరం చేసే పాలకూర జ్యూస్?

ప్రస్తుతం చాలా మంది అనేక కారణాలతో శృంగార సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిని తగ్గించుకోవడానికి ఎక్కువగా హాస్పిటల్‌ల చుట్టూ తిరుగుతుంటారు. వేల రూపాయలను వైద్యం కోసం ఖర్చు చేస్తుంటారు. అలా కాకుండా ఆహారంలో కొన్ని మార్పులను చేసుకుంటే శృంగార సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. 
 
* శృంగార లోపాలను దూరం చేసుకోవాలంటే పాలకూరను మీ డైట్‌లో చేర్చుకోండి. ఎక్కువగా పాలకూరను తీసుకోవాలి. ఇందులోని ఫోలిక్ యాసిడ్ పురుషుల్లో వీర్య వృద్ధికి సహాయపడుతుంది. దీనిని జ్యూస్ చేసుకుని తాగడం వల్ల సమస్య తీరుతుంది. మహిళలు కూడా పాలకూరను ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల కొంతమేర పరిష్కారం ఉంటుంది. 
 
* అదేవిధంగా మిరపకాయలు కూడా సంతాన సమస్యలకు చక్కని పరిష్కారం చూపుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. వీటిని ఆహారంలో ఎక్కువ భాగం ఉండేలా చూసుకోవాలి. 
 
* అంజీర పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల సమస్య చాలా వరకు తగ్గుతుందని పలు పరిశోధనలలో వెల్లడైంది. 
 
* గుమ్మడికాయ విత్తనాలను కూడా తీసుకుంటుండాలి. ఇందులోని ప్రత్యేకమైన విటమిన్‌లు శృంగార సమస్యలను దూరం చేస్తాయి.