గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: శనివారం, 4 మే 2019 (18:32 IST)

రోజూ వాటి రసం తాగితే పురుషుల్లో కొత్త శక్తి...

చాలామంది పురుషులు చూసేందుకు బాగానే ఉన్నప్పటికీ పడక గదిలో మాత్రం తుస్‌మని జావగారిపోతుంటారు. దీంతో శృంగార ప్రేరేపిత మందుల కోసం వెంపర్లాడుతుంటారు. ఇంకొందరు అయితే, వైద్యులను కలిసి తమ సామర్థ్యంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకుంటుంటారు. అయితే, వైద్యుల వద్దకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయడం కంటే.. మనకు అందుబాటులో ఉండే పండ్లను ఆరగిస్తే చాలని చెపుతున్నారు ఆయుర్వేద నిపుణులు. 
 
ఇలాంటి వాటిలో దానిమ్మ ఒకటి. దానిమ్మ రసాన్ని ప్రతి రోజు సేవించినట్టయితే దమ్ముకు దమ్ము... ఆరోగ్యానికి ఆరోగ్యం... లభిస్తుందట. రోజూ ఒక్క గ్లాసు దానిమ్మ రసం లాగిస్తే ముడుచుకుపోయే శరీరం నవయవ్వనంగా విచ్చుకుంటుంది. ఇదీ తాజాగా లండన్ పరిశోధకులు చెప్పిన సత్యం. దానిమ్మపై పరిశోధనలు చేసిన వారు అందులో శృంగార ప్రేరేపిత ఔషధ గుణాలున్నాయని కనిపెట్టారు. 
 
పండ్లు మన దైనందిన ఆహారంలో భాగమయ్యాయి. రకరకాల పండ్లు కాయలను మనం ఆయా రుతువుల్లో తింటుంటాం. ప్రతి పండు లేదా కాయలో మేలు చేసే ఔషధాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఔషధాలు శరీరానికి శక్తిని కూడా ఇస్తున్నాయి. ఇందులో దానిమ్మ చేసే మేలు అంతాఇంతా కాదు. దానిలోని గింజలను ఒలుచుకునే ఓపిక ఉండాలేగానీ, అంతటి ఆరోగ్యం లభిస్తుంది. 
 
దానిమ్మ రసంలో శృంగార రసాన్ని పెంపొందించే లక్షణాలున్నాయని తేలింది. సాధారణంగా శరీరంలోని ఆమ్లత్వాన్ని తగ్గిస్తుందనేది వైద్యశాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెపుతున్నారు. అలాగే కొన్నిరకాల కేన్సర్లకు కూడా విరుగుడగా నిలుస్తుందనేది ఎప్పుడో తేలిపోయింది.
 
దీనిలో హృద్రోగాలకు సంబంధించిన రోగాలను నివారించేందుకు దోహదపడుతుంది. దానిమ్మ రసాన్ని తీసుకోవడం వలన రక్తప్రసరణ చాలా బాగా జరుగుతుందనేది సత్యం. అయితే చాలాకాలం తర్వాత ఇందులో ఇంకొన్ని ఔషధ గుణాలున్నాయని పరిశోధనలు తేల్చేశాయి.
 
దానిమ్మ గింజల రసాన్ని సేవిస్తే గుండెకు మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో భాగంగా అది రక్తాన్ని శృంగార ప్రేరేపిత అవయవాలకు ప్రసారం చేస్తుంది. దీంతో అవి ప్రేరేపితమవుతాయని పరిశోధకులు తెలిపారు. కనుక దానిమ్మ పండును తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది.