శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: గురువారం, 14 సెప్టెంబరు 2017 (21:17 IST)

అరటి పండు గురించి 5 పాయింట్లు...

అరటి పండును ఆస్త్మా వున్న వ్యక్తులు తినకూడదు. కానీ అరటి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవేమిటో చూద్దాం... 1. అరటిపండు డయేరియాను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చెడ్డ బాక్టీరియాను మంచి బాక్టీరియాగా మార్చుతుంది. ఒక అరటి పండుతో 95 క్యాలరీలు

అరటి పండును ఆస్త్మా వున్న వ్యక్తులు తినకూడదు. కానీ అరటి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవేమిటో చూద్దాం... 
 
1. అరటిపండు డయేరియాను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చెడ్డ బాక్టీరియాను మంచి బాక్టీరియాగా మార్చుతుంది. ఒక అరటి పండుతో 95 క్యాలరీలు అందుతాయి. అంతేకాదు దీనిలోని పొటాషియం శరీరంలోని నీటి నిల్వల్ని కాపాడుతుంది. దీనిలో విటమిన్‌ బి6, కాల్షియం, జింక్‌ ఫోలిక్‌ ఆమ్లం, పీచు పుష్కలంగా ఉంటాయి.
 
2. రెండు అరటి పండ్లు, ఒక గుడ్డు, గ్లాసు పాలు, రెండు టేబుల్‌ స్పూన్ల తేనె కలిపి బనానా షేక్‌ తయారుచేసి ఉదయాన్నే తాగితే బలహీనంగా ఉన్నవారు బరువు పెరుగుతారు.
 
3. బాగా పండిన అరటి పండును పెరుగులో కలిపి తింటే వైట్‌ డిశ్ఛార్జ్‌ సమస్యను దూరం చేస్తుంది. అరటి పువ్వును ఉడికించి పెరుగుతో కలిపి తింటే రుతుచక్రం సమయంలో నొప్పినీ రక్తస్రావాన్నీ తగ్గిస్తుంది.
 
4. చిన్నపాటి కాలిన గాయాలను మాన్పించే గుణం అరటిగుజ్జుకు ఉంది. అందానికీ ఆరోగ్యానికీ అరటి బాగా వుపయోగపడుతుంది.
 
5. అజీర్ణాన్ని తగ్గించడంలో, కడుపులోని అల్సర్లను మాన్పించడంలో అరటి తోడ్పడుతుంది. అరటిలో ఉండే పొటాషియం నరాలను ఉత్తేజపరచి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతుంది. దీనిలోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి.