సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 23 నవంబరు 2018 (19:43 IST)

గ్రీన్ యాపిల్ తింటే ఏమవుతుంది?

సాధారణంగా మనం రోజు రకరకాల పండ్లు తింటూ ఉంటాం. ఇవి మన ఆరోగ్యానికి ఎంతోగానో ఉపకరిస్తాయి. ముఖ్యంగా ప్రతిరోజు రోజుకో యాపిల్ తింటే అది గుండె జబ్బులను దరిచేరనీయదు. ఆపిల్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. సాధారణంగా ఎరుపు, ఆకుపచ్చ ఆపిల్స్ పుల్లని, మరియు తియ్యటి రుచిని కలిగి ఉంటాయి. గ్రీన్ యాపిల్ దీర్ఘకాల ఆరోగ్యవంతమైన పండ్లలో ఒకటి. దీనిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. దీని ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
1. గ్రీన్ యాపిల్‌ని ప్రతిరోజు క్రమంతప్పకుండా తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ లోపాల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గించటం, బిపి తగ్గించడం, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, ఆకలిని మెరుగుపరచడం వంటి పనులను సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది. 
 
2. గ్రీన్ యాపిల్‌లో ఇనుము, జింక్, రాగి, మాంగనీస్, పొటాషియం అధికంగా ఉంటాయి. దీనిలో ఉన్న ఇనుము రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాక జీర్ణక్రియ రేటు పెంచటానికి సహాయపడుతుంది.
 
3. బరువు తగ్గాలి అనుకునేవారికి ఈ గ్రీన్ యాపిల్ చక్కగా పనిచేస్తుంది. రక్తనాళాలలో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది. గుండెకు సరైన రక్తప్రవాహం నిర్వహణలో సహాయపడుతుంది.
 
4. గ్రీన్ యాపిల్‌లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. కనుక ఇది చర్మ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
 
5. గ్రీన్ యాపిల్‌లో ఎ, బి, సి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మం కాంతివంతంగా మెరవటానికి, చుండ్రు నివారణకు సహాయపడుతుంది. ఇది వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయదు. రోజుకో యాపిల్ తినటం వలన ముఖం మంచి మెరుపును సంతరించుకుంటుంది. 
 
6. కంటి క్రింద ఏర్పడే నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మెుటిమలను తగ్గించి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.