శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శనివారం, 17 నవంబరు 2018 (14:46 IST)

చక్కెర ముఖానికి రాసుకుంటే..?

చక్కెర ఆరోగ్యానికి మంచి టానిక్‌లా ఉపయోగపడుతుంది. దీనిలోని విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా, తాజాగా మార్చుతాయి. చక్కెరలోని విటమిన్ సి అజీర్తిని తొలగిస్తుంది. సాధరణంగా తలస్నానం చేసినప్పుడు తలనొప్పిగా ఉంటుంది. ఆ నొప్పిని తగ్గించాలంటే.. చక్కెరలో కొద్దిగా పెరుగు కలిపి నుదిటిపై రాసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. మరి చక్కెరలో చర్మ రక్షణకు గల చిట్కాలు తెలుసుకుందాం..
 
పంచదార మృతుకణాలను నశింపజేస్తుందని బ్యూటీ నిపుణులు పెర్కొన్నారు. చలికాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. అందుకు ఇలా చేస్తే చాలు.. పంచారలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి చర్మానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే పొడిబారిన చర్మం కాస్త మృదువుగా మారుతుంది. 
 
పావుకప్పు ఆలివ్ నూనెలో కొద్దిగా చక్కెర కలిపి పేస్ట్‌లా చేసుకుని శరీరానికి రాసుకోవాలి. ఇలా చేస్తే మృతుకణాలు తొలగిపోవడంతో పాటు చర్మం తేమగా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలోని చెడు బ్యాక్టీరియాలను హరింపజేస్తుంది. చక్కెరలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే ముఖంపై జిడ్డు పోతుంది. 

చాలామంది ఆలోచనేంటంటే.. చక్కెర నీటితో స్నానం చేస్తే చర్మం జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా మరి ఏం చేయాలనేదే వారి భావన. ఈ చిన్న విషయానికే చింతించవలసిన అవసరం లేదు. చక్కెర నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి స్నానం చేస్తే జిడ్డు పోతుంది.