శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 9 జులై 2019 (21:28 IST)

కొబ్బరినూనెతో చేసిన వంటలు తింటే ఏం జరుగుతుంది?

కొబ్బరినూనె అనగానే కేవలం జుట్టుకి రాసుకునేదిగానే చాలామంది భావిస్తారు. కానీ..... దీనిలో పోషక విలువలు అమోఘంగా ఉన్నాయి. కొబ్బరినూనెను వంటల్లో చేర్చుకోవడం వలన మన ఆరోగ్యానికి ఎంతో లాభం చేకూరుతుంది. కొబ్బరినూనె వంటకాలలో ఉపయోగించడం వలన  మన ఆరోగ్యానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. కొబ్బరినూనెతో చేసిన వంటలు తినడం వల్ల శరీరంలోని జీవక్రియలు వేగంగా జరుగుతాయి. ఫలితంగా కొవ్వు వేగంగా కరుగుతుంది. అంతేకాకుండా ఇది బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నూనెతో చేసిన వంటలు త్వరగా జీర్ణమవుతాయి. శరీర ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ఒత్తిడి నుండి బయటపడేస్తుంది.
 
2. కొబ్బరినూనె వ్యాధినిరోదక శక్తిని పెంచుతుంది. హానికర బ్యాక్టీరియా, వైరస్ లతో పోరాడుతుంది. ఇది యాంటీబ్యాక్టీరియా, యాంటీ మైక్రోబయల్ లిపిడ్స్, క్యాపిక్స్, క్యాప్రిలిక్, లౌరిక్ ఆమ్లాలను కలిగి ఉంటుంది.
 
3. కొబ్బరినూనెతో చేసిన వంటలు తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిని స్థిరపరుస్తుంది. డయాబెటీస్ తో బాధపడేవారికి ఇది మంచి ఔషదంలా పని చేస్తుంది.
 
4. ఇది గుండెకు కూడా చాలా మేలు చేస్తుంది. కొలస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. బిపిని అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండేవి శ్యాచురేటెడ్ కొవ్వులు కావడం వలన ఎటువంటి హాని ఉండదు.
 
5. కొబ్బరినూనెను చర్మానికి రాసుకోడం వలన చర్మ గాయాలపై దుమ్ము పడకుండా చేసి, ఇన్ ఫెక్షన్లు సోకకుండా రక్షణ కవచంలా పని చేస్తుంది.