గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (14:03 IST)

పాలలో పంచదారకు బదులుగా బెల్లం కలిపి తాగితే...

ప్రతి రోజు లేవగానే పాలు, కాఫీ, టీలు ఇవి తాగుకుంటే రోజంతా గడిచినట్టే ఉండదు. అది కూడా వాటిలో పంచదార వేసుకుని తాగితేనే తాగినట్టుంటుందా.. అయితే ఈ సారి పంచదారకు బదులుగా పాలలో బెల్లం వేసుకుని తాగి చూడండి.

ప్రతి రోజు లేవగానే పాలు, కాఫీ, టీలు ఇవి తాగుకుంటే రోజంతా గడిచినట్టే ఉండదు. అది కూడా వాటిలో పంచదార వేసుకుని తాగితేనే తాగినట్టుంటుందా.. అయితే ఈ సారి పంచదారకు బదులుగా పాలలో బెల్లం వేసుకుని తాగి చూడండి. ఈ కాంబినేషన్‌ వల్ల టేస్ట్ మాత్రమే కాదు చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నిజానికి పంచదార కంటే బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ బెల్లం కన్నా పంచదార రుచి బాగుండటంతో అందరు దాని వైపే మొగ్గుచూపుతారు. అయితే పాలు, బెల్లం కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 
 
పంచదారతో పోలిస్తే బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల బరువు పెరగకుండా ఉంటుంది. బెల్లానికి అనీమియా ఎదుర్కోనే శక్తి పుష్కలంగా వుంది. కాబట్టి మహిళలు ఐరన్ ట్యాబ్లెట్స్ బదులుగా బెల్లం కలిపిన పాలను తాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాలు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. మహిళలకు రుతుక్రమంలో వచ్చే నొప్పిని పాలద్రోలడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలను దృఢంగా ఉంచి, ఎముకల నొప్పిని తగ్గిస్తుంది.