ఈగల కాలం.... తులసి ఆకులు నమిలితే ఏమవుతుందో తెలుసా?
పంటినొప్పితో బాధపడే వారు నిమ్మరసంలో ఇంగువ కలిపి కొద్దిగా వేడి చేసి ఈ రసాన్ని కొద్దిగా తీసుకుని నెప్పిగా ఉన్న పంటిలో ఉంచితే పంటి నొప్పి త్వరగా తగ్గిపోతుంది.
కడుపులో నొప్పి గాని పొట్ట ఉబ్బరం గాని కలిగినప్పుడు దాల్చినచెక్కను పొడిచేసి నీటిలో వేసి మరగించి ఆ నీటిని త్రాగితే పొట్ట నొప్పి ఉబ్బరం రెండు తగ్గిపోతుంది.
మంచి గంధాన్ని అరగదీసి కొబ్బరినూనెలో కలిపి రాస్తే ఎలర్జీలు నల్లమచ్చలు తగ్గిపోతాయి.
రోజూ తులసి ఆకులను నమిలి తింటే హైపటైటిస్, టైఫాయిడ్ వంటి వ్యాధులు దరిచేరవు.
ఎండు ఖర్జూరం వేడి నీటిలో నానబెట్టి దానిలో తేనె కలుపుకుని త్రాగితే ఆస్త్మా సమస్యతో బాధపడే వారికి మంచిది.