శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (16:27 IST)

కిడ్నీ వ్యాధులు దూరం కావాలంటే బిర్యానీ ఆకుల్ని..?

కిడ్నీ సంబంధిత రోగాలను దూరం చేయాలంటే.. వంటల్లో బిర్యానీ ఆకులను వాడాలంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. బిర్యానీ ఆకులు వేసి మరిగించిన నీటిని తాగడం ద్వారా రాళ్లు ఏర్పడటం.. ఇతరత్రా కిడ్నీ సంబంధిత వ్యాధులు రావు

కిడ్నీ సంబంధిత రోగాలను దూరం చేయాలంటే.. వంటల్లో బిర్యానీ ఆకులను వాడాలంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. బిర్యానీ ఆకులు వేసి మరిగించిన నీటిని తాగడం ద్వారా రాళ్లు ఏర్పడటం.. ఇతరత్రా కిడ్నీ సంబంధిత వ్యాధులు రావు. అలాగే దీనిలో కేన్సర్ కారకాలు వున్నాయి. అందువల్ల దీన్ని తీసుకుంటే.. కేన్సర్ కారకాల ఉత్పత్తిని తగ్గించేందుకు దోహదపడుతుంది.
 
బిర్యానీ ఆకుల వల్ల అల్సర్లు, గ్యాస్ట్రిక్స్ సమస్య వంటి జీర్ణ సంబంధమైన వ్యాధులను దరి చేరనీయదు. అలాగే మధుమేహాన్ని నియంత్రిస్తుంది. మధుమేహులు రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ కొద్దిగా బిర్యానీ ఆకులను నీటిలో కలుపుకుని తాగితే హాయిగా నిద్ర పడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.