బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 30 జులై 2018 (10:20 IST)

ప్రతిరోజూ క్యారెట్ జ్యూస్ తీసుకుంటే?

క్యారెట్‌ను ప్రతిరోజూ జ్యూస్ రూపంలో తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు సరైన దిశలో అందుతాయి. క్యారెట్స్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరుచుటకు దోహదపడుతుంది. శరీర రోగనిరోధక శక్తిని

క్యారెట్‌ను ప్రతిరోజూ జ్యూస్ రూపంలో తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు  సరైన దిశలో అందుతాయి. క్యారెట్స్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరుచుటకు దోహదపడుతుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచుటలో మంచిగా దోహదపడుతుంది. ఈ క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వలన మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యల నుండి విముక్తి చెందవచ్చును.
 
హైబీపీని అదుపులో ఉంచుతుంది. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను రాకుండా కాపాడుతుంది. ధూమపానం చేసే వారు క్యారెట్ జ్యూస్‌ను ప్రతిరోజూ తీసుకుంటే ధుమాపానం వలన కలిగే దుష్పరిణామాల నుండి తప్పించుకోవచ్చును. ఈ క్యారెట్స్‌లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మంపై ఉండే మచ్చలు, మెుటిమలు తొలగించుటలో సహాయపడుతాయి. 
 
క్యారెట్లలో విటమిన్ బి6, కె, పాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. అసిడిటీని తగ్గించడంలో క్యారెట్ జ్యూస్ మెరుగ్గా పనిచేస్తుంది. శ్వాసకోశ సమస్యలు  తొలగిపోతాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతాయి. వీటిపై ఒత్తిడి తగ్గుతుంది. కీళ్ల నొప్పులను తగ్గించుటలో క్యారెట్స్ చాలా ఉపయోగపడుతాయి.