బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Kowsalya
Last Updated : శనివారం, 28 జులై 2018 (14:07 IST)

పాలకూర సూప్ తయారీ విధానం...

కాయకూరలతో పోలిస్తే ఆకుకూరలు బిన్నమైనది. కొవ్వు శాతాన్ని తక్కువగా కలిగి ఉంటుంది. పాలకూరలో విటమిన్ ఎ, సి, ఇతో పాటు ఐరన్, పొటాషియం, క్యాల్షియం, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరచడంలో పాలక

కాయకూరలతో పోలిస్తే ఆకుకూరలు బిన్నమైనది. కొవ్వు శాతాన్ని తక్కువగా కలిగి ఉంటుంది. పాలకూరలో విటమిన్ ఎ, సి, ఇతో పాటు ఐరన్, పొటాషియం, క్యాల్షియం, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరచడంలో పాలకూర కీలకపాత్రను పోషిస్తుంది. ఇటువంటి పాలకూరతో సూప్ ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
పాలకూర - 1 కప్పు 
వెల్లుల్లి రెబ్బలు - 5 
వెన్న లేదా నూనె - స్పూన్ 
పాలు - అరకప్పు
కార్న్‌ఫ్లోర్‌ - 1 స్పూన్ 
మిరియాలపొడి - 2 స్పూన్స్
ఉప్పు - సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా పాలకూర ఆకుల్ని శుభ్రంగా కడగాలి. ఇప్పుడు కుక్కర్‌లో కాస్తంత వెన్న వేడిచేసి అందులో వెల్లుల్లి రెబ్బల్ని వేగించాలి. ఆ తరువాత ముందుగా శుభ్రం చేసుకున్న పాలకూరని ఆ మిశ్రమంలో వేయాలి. తరువాత పాలు, నీళ్లను పోసి కుక్కర్‌కు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఉడికిన మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో కార్న్‌ఫ్లోర్‌ను వేసి అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి మరికాసేపు ఉడికించుకోవాలి. అంతే వేడివేడి పాలకూర సూప్ రెడీ.