శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : శనివారం, 23 జూన్ 2018 (11:08 IST)

అలా చేస్తే బరువు తగ్గుతారట...

హెటెక్ యుగంలో ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఉరుకులు పరుగులతో గడిపేస్తున్నాడు. ఫాస్ట్ లైఫ్‌లో కొంతమందికి ఆహారం తీసుకునేందుకు కూడా సమయం దొరకట్లేదు. కొంతమందైతే టిఫిన్ తీసుకోవడమే కాదు.. సరైన సమయానికి ఆహారం

హెటెక్ యుగంలో ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఉరుకులు పరుగులతో గడిపేస్తున్నాడు. ఫాస్ట్ లైఫ్‌లో కొంతమందికి ఆహారం తీసుకునేందుకు కూడా సమయం దొరకట్లేదు. కొంతమందైతే టిఫిన్ తీసుకోవడమే కాదు.. సరైన సమయానికి ఆహారం తీసుకోవడానికి వారి సమయం లభించడం లేదు. పైగా, తమకు సమయం చిక్కినపుడు ఫుడ్ ఆరగించినా అది పూర్తిగా నమిలి మింగకుండానే అరకొరగా మింగేస్తున్నాడు. ఇలా చేయడం కూడా ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని వైద్యులు సలహా ఇస్తున్నారు.
 
ముఖ్యంగా, ఎంతా హడావుడిగా ఆహారం తీసుకున్నా... ఆహారాన్ని నమిలి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు.. ఆహారాన్ని నమిలి తినడం ద్వారా బరువు తగ్గుతారని తాజా అధ్యయనంలో తేలింది. తీసుకునే ఆహారాన్ని నమిలి తినడం ద్వారా కెలోరీల శాతం తగ్గుతుందని, దీంతో బరువు తగ్గడం జరుగుతుందని చైనాకు చెందిన హర్బిన్ మెడికల్ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 
 
ఇలా నమిలి తినడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. దాదాపు 15 నిమిషాల పాటు లేదా 40 సార్లు ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం ద్వారా 12 శాతం బరువు తగ్గగలరని ఆ అధ్యయనంలో తెలియవచ్చింది. ఇంకా 90 నిమిషాల పాటు ఆహారాన్ని నమిలి తినడం ద్వారా ఊబకాయం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆ స్టడీలో తేలింది.