టమోటా తినండి... ఆరోగ్యంగా ఉండండి...
టమోటాలు లేని వంటకాలు అంతగా రుచించవంటారు. ఎర్రటి టమోటాలు అందరి మనసులను దోచుకుంటాయనడంలో సందేహం లేదు. ఆరోగ్యానికి ఉపయోగపడే పలు పోషక విలువలున్న ఈ టమోటాను తీసుకుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చును. ఇందుల
టమోటాలు లేని వంటకాలు అంతగా రుచించవంటారు. ఎర్రటి టమోటాలు అందరి మనసులను దోచుకుంటాయనడంలో సందేహం లేదు. ఆరోగ్యానికి ఉపయోగపడే పలు పోషక విలువలున్న ఈ టమోటాను తీసుకుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చును. ఇందులో క్యాల్షియం, పాస్పరస్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.
ఎసిడిటీతో బాధపడేవారు టమోటాలతో తయారుచేసిన వంటకాలను తింటే మంచి ఫలితాలను పొందవచ్చును. టమోటాల్లో సిట్రిక్ అనే ఆమ్లం ఉండటంతో ఎసిడిటీ నుంచి విముక్తి చెందవచ్చును. మధుమేహ వ్యాధిగ్రస్తులకు టమోటా ఎంతో లాభదాయకంగా పనిచేస్తుంది. మూత్రంలో చక్కెర శాతాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
టమోటాతో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండటం వలన ఉత్తమమైన ఆహారంగా పరిగణించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిని తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుపడుటకు సహాయపడుతుంది. బరువును నియంత్రిచేందుకు చాలా ఉపయోగపడుతుంది. కంటి జబ్బులకు టామోటాల్లో ఉన్న విటమిన్ ఏ అధికంగా ఉండటంతో కంటి జబ్బులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. టమోటాలు విరివిగా తీసుకునే వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.