ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. యోగాసనాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (14:32 IST)

యోగాసనాలు వేసేముందుగా తీసుకోవలసిన జాగ్రత్తలు.....

యోగాసనాలు వేసే ముందుగా కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ప్రతిరోజు యోగాకు గంట సమయం కేటాయించాలి. దానిలో అరగంట ఆసనాలకు, 10 నిమిషాలు ప్రాణాయామం, 20 నిమిషాలు ధ్యానంకు కేటాయించుకుంటే మంచి ఫలితాలను పొంద

యోగాసనాలు వేసే ముందుగా కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ప్రతిరోజు యోగాకు గంట సమయం కేటాయించాలి. దానిలో అరగంట ఆసనాలకు, 10 నిమిషాలు ప్రాణాయామం, 20 నిమిషాలు ధ్యానంకు కేటాయించుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. ఆసనాలు వేసే ముందుగా మీరు తీసుకోవలసిన కొన్ని అంశాలను తెలుసుకుందాం.
 
8 నుండి 60 సంవత్సరాల వయస్సు గల వాళ్లు మాత్రమై యోగా చేయాలి. తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత యోగాసనాలు వేయాలి. ఆసనాలు వేసే ముందుగా గోరువెచ్చటి నీటితో స్నాసం చేస్తే మంచిది. ఉదయాన్నే ఆసనాలు వేయడం వలన ఆ సమయంలో ఏర్పడే గాలిలో ప్రాణ శక్తి ఎక్కువగా ఉంటుంది. శబ్దాలు, గోలలు లేకుండా ఉండే ప్రదేశాలలో మాత్రమే యోగా చేయాలి.
 
పలుచటి బట్టను నేలపై పరిచి పద్మాసనం లేదా సుఖాసనం లేదా మీకు ఇష్టమైన ఆసనాన్ని వేయాలి. ఆ తరువాత ప్రశాంతంగా కనులు మూసుకొని ధ్యాస శ్వాసమీదే నిలపాలి. గాలి వదిలినప్పుడు పొట్టను లోపలకు పీల్చినపుడు ముందుకు వస్తుందో లేదానని గమనించాలి. దీనికై పొట్ట ద్వారా కాకుండా, ఛాతీ ద్వారా గాలి పీల్చుకుంటే మాత్రం శ్వాససరి కాదని గుర్తించుకోవాలి.
 
ఆసన ప్రారంభ సమయంలో పద్మాసనం, వజ్రాసనం ఏదైనా వేయాలి. ఆసనం వేసేటప్పుడు ఎప్పుడూ తొందర పడకూడదు నెమ్మదిగ వేయాలి. ఆసనం వేసిన తరువాత కొన్ని నిమిషాల పాటు అలానే ఉండాలి. ఆసనం వేసేటపుడు ఎంత నెమ్మదిగా వేస్తామో అంతకంటే నెమ్మదిగా మామూలు స్థానంలోకి రావాలి. గాలి పీల్చటం, వదలటం వంటి ఆసనాల్లో పైకి శబ్దం వచ్చేలా వదలటం, పీల్చటం చేయకూడదు. 
 
ఏ ఆసనమైనా వేసేటపుడు రొప్పుతూ లేదా ఆయాస పడుతూ చేయకూడదు. ఇలా చేయడం మీ శరీర ఆరోగ్యానికి హానికరం. కావున ఆసనాలు వేయాలనుకుంటే కాస్తే నెమ్మదిగా,  జాగ్రత్తగా వేయాలి. అప్పుడే మీరు చేయాలకున్నది చేయగలుగుతారు. యోగా చేసేటపుడు తొలరపాటుతనం పనికిరాదు. ఉదయాన్నే యోగాచేయుటవలన మంచి ఆరోగ్యం లభిస్తుంది, రోజంతా ప్రశాంతంగా ఉంటుంది.