కరివేపాకు, వేపాకు ముద్దను మజ్జిగలో కలిపి తీసుకుంటే?

శనివారం, 1 జులై 2017 (15:48 IST)

చర్మసమస్యలు వేధిస్తుంటే? లేత కరివేపాకు, వేపాకు ఆకులను ముద్దగా నూరి ఒక స్పూన్ ముద్దను అరకప్పు మజ్జిగలో పరగడుపున తీసుకుంటే చర్మ సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. దురదతో ఇబ్బందులు పడేవారు కరివేపాకు, పసుపును సమానంగా తీసుకుని పొడిగొట్టి రోజూ ఒక స్పూన్ మోతాదులో నెలరోజులు తీసుకుంటే అలెర్జీలు మటుమాయం అవుతాయి.
 
ప్రతిరోజూ కరివేపాకు పొడిని ఒక స్పూన్ మోతాదులో తీసుకుంటే రక్తపోటును నియంత్రించవచ్చు. మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఒకస్పూన్ కరివేపాకు రసాన్ని రోజూ రెండుపూటలా తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. 
 
కరివేపాకు రసాన్ని పెరుగు లేదా వెన్నతో కలిపి పూతలా వేసుకుంటే కంటికిందటి వలయాలు మాయమవుతాయి. కరివేపాకును కొబ్బరినూనెలో మరిగించి.. వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరగడంతో పాటు తెల్లబడవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  
Neem Health Benefits Allergy Curry Leaves Coconut Oil

Loading comments ...

ఆరోగ్యం

news

టిఫిన్ చేసిన వెంటనే కాఫీ, టీలు తాగడం చేస్తే?

టిఫిన్ లేదా భోజనం చేసిన వెంటనే కాఫీ, టీలు తాగే అలవాటున్నవారు మానుకోవాల్సిందే అంటున్నారు.. ...

news

ఒత్తిడి అధికమైతే.. రోజూ మధ్యాహ్న భోజనంలో ఒక కప్పు పెరుగు తీసుకోండి

పనిలో ఒత్తిడి అధికమైందా? ఆందోళన వేధిస్తుందా? అయితే వెంటనే ఓ కప్పు పెరుగును రోజువారీ ...

news

కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడుతాయి? జాగ్రత్తలేమిటి?

కిడ్నీలో రాళ్లకు కారణం కొన్ని ఆహార పదార్థాలే. పాలు, పాలకూర, సోయాబీన్స్, చాక్లెట్లు వంటివి ...

news

రోజుకు ఓ కప్పు కొబ్బరి పాలు తీసుకుంటే...?

దక్షిణ భారతదేశంలోని కేరళ వంటి రాష్ట్రాల్లో కొబ్బరి నూనెను ఎక్కువగా వంటకాల్లో ...