రాత్రిపూట.. ఫుల్‌గా లాగిస్తే.. ఒబిసిటీ తప్పదు..

సోమవారం, 10 జులై 2017 (11:21 IST)

food eating

ఉదయం, మధ్యాహ్నం తక్కువగా భోజనం తీసుకుని.. రాత్రిపూట ఫుల్‌గా లాగిస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఉదయం భోజనం అధికంగా.. మధ్యాహ్నం మామూలుగా.. రాత్రి పూట స్వల్పంగా తీసుకోవడం చేస్తే ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అలా కాకుండా ఉదయం, మధ్యాహ్నం ఏదో కొంత తీసుకుని.. రాత్రి పూట ఎక్కువగా తీసుకుంటే స్థూలకాయం తప్పదని.. తద్వారా అనారోగ్యాలు సైతం తప్పవంటున్నారు.. ఆరోగ్య నిపుణులు.  
 
జీర్ణక్రియ మందగించే రాత్రివేళ ఆహారం అతిగా తీసుకోవడం వల్ల పేగులు, లివర్‌, క్లోమగ్రంథి కూడా అధికంగా పనిచేయవలసి వస్తుంది. దీనివల్ల దేహక్రియలన్నీ కుంటుపడే మెటబాలిక్‌ సిండ్రోమ్‌ సమస్య కూడా తలెత్తుతుంది. ఇంకా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కొవ్వులో ఇన్సులిన్‌ను పనిచేయకుండా చేసే యాంటీ- ఇన్సులిన్‌ హార్మోన్లు ఉంటాయి. దీనివల్ల ఇన్సులిన్‌ అవసరం మరింత పెరిగిపోతుంది. క్రమంగా ఇది మధుమేహానికి దారి తీస్తుంది. 
 
ఈ కొవ్వు నిలువల వల్ల స్థూలకాయం, మధుమేహంతో పాటు అధికరక్తపోటు, అతినిద్ర, సోమరితనం అలవడతాయి. రాత్రివేళ మాత్రమే కాదు, పగటిపూట కూడా అధికంగా కేలరీలు ఉండే నూనె, కొవ్వు పదార్థాలు, ఎక్కువ గ్లూకోజ్‌ ఉండే స్వీట్లు, కార్బోహైడ్రేట్లు తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  
Night Sleep Diabetics Obesity Insullin Glucose Sweets Fat Less Foods

Loading comments ...

ఆరోగ్యం

news

ప్రతి ఇంటిలోనూ ఉండాల్సిన మధురపలం దానిమ్మతో షుగర్‌కి చెక్

మధుమేహ రోగులు ఈ ప్రపంచంలో నాలుగు వస్తువులు లేవనుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అవేమంటే ...

news

ప్రతిరోజు ఆహారంలో మొదటి ముద్దను కరివేపాకు పొడితో తింటే...?

తాలింపులో సుగంధద్రవ్యంగా కరివేపాకును వాడుతారు. ఈ విధంగా అవసరానికి మన ఇంట్లో లేకపోయినా ...

news

నిద్ర పట్టడం లేదా.. అయితే, ఇలా చేయండి...

చాలామందికి రాత్రి వేళల్లో నిద్రపట్టదు. మరికొందరు బాగా పొద్దుపోయాకగానీ నిద్రకు ...

news

టాబ్లెట్లు ఎలా వేసుకోవాలి? మాత్ర చేదుగా వుందనీ...

సాధారణ జబ్బులకు సైతం వైద్యులు మాత్రలు రాసివ్వటం అతి సహజం. అయితే మాత్రలు మింగటానికి మనం ...