Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ముల్లంగి ఆకుల్ని దంచి తీసిన రసంతో ఉలవచారు కాచుకుని తాగితే...?

గురువారం, 4 జనవరి 2018 (19:23 IST)

Widgets Magazine
Horsegram

ఉలవల్ని పశువులకు గుగ్గిళ్ళుగా పెట్టడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం మనం. కాని వాటికి అమోఘమైన ఔషధ గుణాలున్నాయి. ఉలవలు తెలుపు, ఎరుపు, నలుపు... ఇలా మూడు రంగుల్లో దొరుకుతాయి. వీటిల్లో నల్ల ఉలవలు ఎక్కువ శ్రేష్టం అని శాస్త్రం. మిగత రెండు కూడా వాడుకోవచ్చు. అవి కూడా మంచి ఫలితాలిస్తాయి. ఉలవలు శరిరానికి బాగా వేడిని కలిగిస్తాయి. 
 
కానీ వాతాన్ని, జలుబుని, భారాన్నితగ్గించి, శరీరాన్ని తేలికపరుస్తాయి. ఊపిరికుట్టు నొప్పిని తగ్గిస్తాయి. మూత్రం ఫ్రీగా నడిచేలా చేస్తాయి. మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళను కరిగించడానికి సహాయపడతాయి. ముల్లంగి ఆకుల్ని దంచి తీసిన  రసంతో ఉలవచారు కాచుకుని తాగితే రాళ్ళు త్వరగా కరుగుతాయి. 
 
స్త్రీల బహిష్టుకు సంబంధించిన వ్యాధులన్నింటి మీదా ఉలవలు ప్రభావం చూపిస్తాయి. ప్రసవించిన స్త్రీల మైలరక్తం పూర్తిగా బయటకు పోవడానికి ఉలవలు బాగా తోడ్పడతాయి. బహిష్టు అయినప్పుడు ఉలవలు తీసుకుంటే ఋతురక్తం బాగా అవుతుంది. ఇలా ఋతురక్తం సరిగా కానివారు మాత్రమే ఉలవలు తీసుకోవాలి. ఉలవల్ని చారులాగా కాచుకొని తీసుకోవడం వల్ల అనేక రకమైన వ్యాధులను నివారించుకోవచ్చు. ఉలవల్ని ఉడికించి గుగ్గిళ్ళుగా తీసుకోవడం వల్ల శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగింవచవచ్చు. దీని వలన శరీరంలో అధిక బరువు తగ్గి, దృఢత్వం ఏర్పడుతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

బీట్ రూట్ తినేవారికి ముఖ్యమైన సమాచారం..

మార్కెట్లో లభించే కూరగాయల్లో బీట్రూట్ ఒకటి. రక్తం రంగులో ఉన్న బీట్రూట్‌ను ఎంత ఎక్కువ ...

news

గోరు వెచ్చని నీరు తాగితే... (video)

గోరు వెచ్చని నీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్టు జపాన్ పరిశోధకులు తెలిపారు. ఈ ...

news

మీ స్మార్ట్ ఫోనూ... మీ ల్యాప్‌ట్యాపూ... మీ టీవీ... మరి మీ కళ్లూ...?

దేవుడు మనిషికి రెండు కళ్లను ఇస్తే, మనిషి స్వయంకృతాపరాధంతో మరో రెండు కళ్లను కొని ...

news

గ్రీన్ టీ రోజుకు రెండు కప్పులే తాగాలి..

గ్రీన్ టీని రోజూ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. గ్రీన్ టీతో చెడు ...

Widgets Magazine