శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By tj
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (20:57 IST)

తేనెలో వాటిని కలుపుకుని తింటే బెడ్ దిగరు..!

బాదంపప్పు ప్రకృతి ప్రసాదించిన వరమని చెప్పవచ్చు. బాదంపప్పులోని పోషక విలువలు మనకు బాగా ఉపయోగపడతాయి. ఆధునికకాలంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే బాదంపప్పును తప్పనిసరిగా తినాలి. బాదం గింజలు బలవర్థకమైన ఆహారం. బాదం

బాదంపప్పు ప్రకృతి ప్రసాదించిన వరమని చెప్పవచ్చు. బాదంపప్పులోని పోషక విలువలు మనకు బాగా ఉపయోగపడతాయి. ఆధునికకాలంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే బాదంపప్పును తప్పనిసరిగా తినాలి. బాదం గింజలు బలవర్థకమైన ఆహారం. బాదం పప్పు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 
 
చదువుకునే పిల్లలకు బాదంపప్పులు ఎంతో మేలు చేస్తుందట. పిల్లలకు జ్ఞాపకశక్తిని ఇది బాగా పెంచుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మెదడు ఆరోగ్యానికి, రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. అంతే కాదు గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా బాదంపప్పు తింటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలు పుడతారట. అలసట, నీరసం ఉన్న వారు బాదంపప్పులు తింటే అస్సలు అవి దగ్గరకు కూడా రాదు. 
 
ఇదిలావుంటే బాదంపప్పులు జింక్, సెలీనం, విటమిన్-ఇ ఉండడం వల్ల మగవారిలో సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి చేయడానికి సహాయం చేస్తుందట. అంతే కాదు లైంగిక అవయవాలకు రక్తప్రసరణ జరిగడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందట. బాదంపప్పును తేనెలో కలిపి తింటే శృంగార జీవితం సుఖవంతంగా ఉంటుందట. వారంరోజుల పాటు బాదంపప్పులను నిరంతరాయంగా తినేవారికి మూడురోజుల పాటు సెక్స్ కోరికలు ఎక్కువగా పుడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.