శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 19 సెప్టెంబరు 2018 (17:40 IST)

కలబంద రసం అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు...

అధిక బరువు తగ్గాలనుకునేవారు వ్యాయమంతో పాటు కలబంద రసాన్ని తరచుగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కలబంద శరీర అవయవాల చుట్టూ ఉండే కొవ్వును కరిగిస్తుంది. ఈ కలబంద రసం జీర్ణక్రియలు పెంచుటకు చక్కగా పనిచేస్తుంది. కప్పు వేడినీళ్ళల్లో కలబంద రసం, అల్లం ముక్కు వేసు

అధిక బరువు తగ్గాలనుకునేవారు వ్యాయమంతో పాటు కలబంద రసాన్ని తరచుగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కలబంద శరీర అవయవాల చుట్టూ ఉండే కొవ్వును కరిగిస్తుంది. ఈ కలబంద రసం జీర్ణక్రియలు పెంచుటకు చక్కగా పనిచేస్తుంది. కప్పు వేడినీళ్ళల్లో కలబంద రసం, అల్లం ముక్కు వేసుకుని బాగా వేడిచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ సేవిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.
 
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అధిక బరువును తగ్గించుటలో గ్రీన్ టీ దివ్యౌషధంగా సహాయపడుతుంది. అలానే గ్రీన్ టిలో కలబంద రసం వేసుకుని వేడిచేసి ఉదయాన్నే, రాత్రివేళ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అధిక బరువును తగ్గించుటకు స్ట్రాబెర్రీ పండ్లు చాలా ఉపయోగపడుతాయి. ఎందుకంటే ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యాలరీలు చాలా తక్కువ పరిమాణంలో ఉన్నాయి కనుక బరువు తగ్గించుటకు స్ట్రాబెర్రీ పండ్లు చాలా పరిపూర్ణంగా ఉపయోగపడుతాయని చెబుతున్నారు.