గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 19 సెప్టెంబరు 2018 (12:46 IST)

మజ్జిగలో కొద్దిగా కరక్కాయ పొడిని కలుపుకుని తీసుకుంటే?

మజ్జిగలో కొద్దిగా కరక్కాయ పొడిని కలుపుకుని ప్రతిరోజూ భోజనానికి ముందు తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. రాత్రివేళ భోజనానికి ముందుగా 5 గ్రాముల కరక్కాయ చూర్ణంలో బెల్లం కలుపుకుని సేవిస్తే రక్తమెులలు తగ్గిపో

మజ్జిగలో కొద్దిగా కరక్కాయ పొడిని కలుపుకుని ప్రతిరోజూ భోజనానికి ముందు తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. రాత్రివేళ భోజనానికి ముందుగా 5 గ్రాముల కరక్కాయ చూర్ణంలో బెల్లం కలుపుకుని సేవిస్తే రక్తమెులలు తగ్గిపోతాయి. 5 గ్రాముల కరక్కాయ చూర్ణాన్ని 3 గ్రాముల తేనెతో రోజూ రెండు పూటలా తీసుకుని చప్పిడి ఆహారాన్ని తీసుకుంటే పచ్చకామెర్లు త్వరగా తగ్గేందుకు అవకాశాలున్నాయి.
 
కరక్కాయ చూర్ణంలో కొద్దిగా పిప్పలి చూర్ణం వేసి తేనెను కలుపుకుని ప్రతి నాలుగు గంటలకు ఓసారి తీసుకోవడం వలన దగ్గు, జలుబు వంటి సమస్యలు తొలగిపోతాయి. నీటిని ఇనుప పాత్రలో వేడిచేసి ఆ నీటిలో కరక్కాయ చూర్ణాన్ని కలిపి లేపనంగా వేస్తే గోరుచుట్టు వ్యాధి తగ్గుతుంది.