శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 17 ఆగస్టు 2018 (15:16 IST)

ఎముకలు బలంగా ఉండేందుకు.. బీన్స్‌ తీసుకుంటే?

ఎముకలు బలానికి బీన్స్ చాలా ఉపయోగపడుతాయి. ఈ బీన్స్‌లో బి6, థయామిన్, విటమిన్ సి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిల్లో శరీర రోగనిరోధక శక్తిని పెంచే ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. అనేక రకాల క్యాన్సర్ వ్యా

ఎముకలు బలానికి బీన్స్ చాలా ఉపయోగపడుతాయి. ఈ బీన్స్‌లో బి6, థయామిన్, విటమిన్ సి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిల్లో శరీర రోగనిరోధక శక్తిని పెంచే ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. అనేక రకాల క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుటకు బీన్స్ చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయి.
 
ప్రతిరోజూ బీన్స్‌ను ఆహారంలో చేర్చుకుంటే రక్తప్రసరణను మెరుగుపరచుటలో సహాయపడుతుంది. మధుమేహాన్ని అదుపు చేయవచ్చును. బీన్స్‌లోని పీచు పదార్థాలు, విటమిన్ ఎ, కోలెడ్, మెగ్నిషియం వంటి ఖనిజాల ఉండడం వలన రక్తంలోని కొవ్వును కరిగించుటకు దోహదపడుతాయి. కంటిచూపును మెరుగుపరచుటలో బీన్స్‌‌లో గల పోషకాలు చాలా ఉపయోగపడుతాయి.