శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: గురువారం, 16 ఆగస్టు 2018 (21:48 IST)

మొక్కజొన్న తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

మెుక్కజొన్న గురించి తెలియని వారు ఉండరు. మెుక్కజొన్న విరివిగా, అతి చౌకగా లభించే ఆహారం. దీని గింజలను పచ్చిగా కాని, కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. మెుక్కజొన్న గింజల నుండి పాప్ కార్న్, కార్న్ ఫ్లేక్స్ తయారుచేస్తారు. మెుక్కజొన్న పిండితో రొట్టెలు చ

మెుక్కజొన్న గురించి తెలియని వారు ఉండరు. మెుక్కజొన్న విరివిగా, అతి చౌకగా లభించే ఆహారం. దీని గింజలను పచ్చిగా కాని, కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. మెుక్కజొన్న గింజల నుండి పాప్ కార్న్, కార్న్ ఫ్లేక్స్ తయారుచేస్తారు. మెుక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. ఇది చాలా బలమైన ఆహారపదార్ధం. ఇంతేకాకుండా దీని వలన చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.
 
1. మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. మెుక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు ఉంటే అది మలబద్దకం, మెులలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్ అరికడుతుంది.
 
2. ఎముకల బలానికి అవసరమైన లవణాలు, మినరల్స్ మెుక్కజొన్నలో పుష్కలంగా ఉంటాయి. పసుపు రంగులో ఉండే ఈ చిన్న గింజలలో  మినరల్స్ అధికంగా ఉంటాయి. మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటివి కూడా వీటిలో ఉండి ఎముకలు గట్టిపడేలా చేస్తాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచటంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి.
 
3. మెుక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచి ఎప్పటికి చిన్నవారుగా కనపడేలా చేస్తాయి. మెుక్కజొన్న గింజల నూనెను చర్మానికి రాస్తే దీనిలో ఉండే లినోలె యాసిడ్ చర్మ మంటలను, ర్యాష్‌లను తగ్గిస్తుంది.
 
4. మెుక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్ ఉండటం వలన అది రక్తహీనతను తగ్గిస్తుంది.
 
5. మెుక్కజొన్నను ప్రతిరోజు తినడం వలన హెయిర్ ఫోలీ సెల్స్‌కు బలాన్ని చేకూరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి పవర్‌పుల్ యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ వల్ల హెయిర్ స్మూత్‌గా, మంచి షైనింగ్‌గా ఉంటుంది.