గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 ఆగస్టు 2018 (13:40 IST)

రెడ్‌వైన్ తాగుతున్నారా... అది దెబ్బతినడం ఖాయం...

అనేకమంది మద్యంబాబులు ఇష్టపడే మద్యం రెడ్‌వైన్. దీన్ని మహిళలు కూడా కూడా విపరీతంగా తాగుతున్నారు. శరీరానికి ఏమాత్రం హాని చేయదన్నది వారి అభిప్రాయం. అయితే, రెడ్‌వైన్ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్న

అనేకమంది మద్యంబాబులు ఇష్టపడే మద్యం రెడ్‌వైన్. దీన్ని మహిళలు కూడా కూడా విపరీతంగా తాగుతున్నారు. శరీరానికి ఏమాత్రం హాని చేయదన్నది వారి అభిప్రాయం. అయితే, రెడ్‌వైన్ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
 
అధిక మోతాదులో రెడ్‌‌వైన్‌ తీసుకోవడం వల్ల కేన్సర్‌, హృద్రోగంతో పాటు డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా శుద్ధిచేయని, చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ద్రాక్షరసం తాగటం వల్ల కాలేయం దెబ్బతింటుందని తెలిపారు. ఈ పరిణామాల వల్ల శరీరంలోని చెడు కొవ్వు శాతం పెరుగుతుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు.
 
ఈ రెడ్‌వైన్‌ను రోజూ తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో పాటు చర్మ సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందట. దీనికి కారణం ఈ వైన్‌లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల ముఖంపై మొటిమలు వస్తాయని, చర్మం కళ కోల్పోతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే, కళ్లకింద నల్లటి వలయాలు కూడా ఏర్పడతాయని పేర్కొన్నారు. ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే సాధ్యమైనంత వరకు రెడ్‌ వైన్‌ను తాగకపోవడమే మంచిదని పరిశోధకులు సూచనలిస్తున్నారు.