శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (10:47 IST)

ప్రతిరోజూ క్యాబేజీని తీసుకుంటే?

క్యాబేజీలో విటమిన్ ఎ, బి1, బి2, బి6, ఇ, సి, కె, పొటాషియం, సల్ఫర్, పాస్పరస్, ఫోలేట్, ఐరన్, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. క్యాబేజీని తరుచుగా తీసుకోవడం వలన క్యాలరీలు చాలా

క్యాబేజీలో విటమిన్ ఎ, బి1, బి2, బి6, ఇ, సి, కె, పొటాషియం, సల్ఫర్, ఫాస్పరస్, ఫోలేట్, ఐరన్, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. క్యాబేజీని తరుచుగా తీసుకోవడం వలన క్యాలరీలు చాలా తక్కువగా లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ చాలా ఉపయోగపడుతుంది. క్యాబేజీలో గల సల్ఫర్ శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపుతుంది.
 
హార్మోన్ల ఉత్పత్తిలో క్యాబేజీ చాలా చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా లివర్, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఎరుపు రంగు క్యాబేజీను తీసుకోవడం వలన డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఈ క్యాబేజీలో ఫైటోన్యూట్రియన్స్ పుష్కలంగా ఉన్నాయి. 
 
ఇవి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేందుకు సహాయపడుతాయి. క్యాబేజీలో విటమిన్ సి, కెలు చర్మాన్ని ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ నుండి రక్షిస్తాయి. తద్వారా మెుటిమలు, గజ్జి వంటి చర్మ వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది.