మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (10:38 IST)

ఆవాల పొడితో ఆ వ్యాధి మటుమాయం...?

చాలామంది మధమేహ వ్యాధితో బాధపడుతున్నారు. ఇందుకు కారణం ఇన్సులిన్ వైఫల్యమని చెప్తున్నారు వైద్యులు. పాంక్రియాటిక్ గ్రంథిలో తయారయ్యే ఈ హార్మోన్ రక్తంలోని షుగర్‌ను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ వైఫల్యంతో షుగర్ పెరిగి డయాబెటిస్ వస్తుంది. ఈ వ్యాధి నుండి విముక్తి చెందాలంటే.. రోజువారి ఆహారంలో ఆవాలు చేర్చుకుంటే తప్పక ఫలితం ఉంటుంది. మరి ఆవాలలోని ప్రయోజనాలు తెలుసుకుందాం...
 
1. కప్పు ఆవాలను పొడిచేసుకుని అందులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే వ్యాధి అదుపులో ఉంటుంది. అలానే ఈ పొడిలో కొద్దిగా నూనె కలిపి ఇడ్లీ, దోస వంటి వాటిల్లో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
2. ఆవాలను బాగా ఎండబెట్టుకుని నూనెలో వేయించుకుని అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా వేయించుకుని తీసుకుంటే మధుమేహ వ్యాధిని అదుపు చేయవచ్చు. 
 
3. ఆవాల పొడిని రోజుకు మూడు పూటలా స్పూన్ మోతాదులో తీసుకుంటే రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఆవాలలోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచుటకు చాలా ఉపయోగపడుతాయి. 
 
4. శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆవాలను నెయ్యిలో వేయించి అందులో కొద్దిగా ఉప్పు, కరివేపాకు చేర్చి పొడి చేసుకోవాలి. ఈ తయారుచేసిన మిశ్రమాన్ని రోజు అన్నంలో కలిపి సేవిస్తే వ్యాధి తగ్గుముఖం పడుతుంది. 
 
5. కప్పు పెరుగులో కొద్దిగా ఆవాల పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి తింటే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. తరచుగా ఆవాలతో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలైన తొలగిపోతాయి. తద్వారా వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది.