1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 3 అక్టోబరు 2018 (11:34 IST)

అబ్బ... కమలాపండ్లు వచ్చేశాయి... తింటే ఏం జరుగుతుందో తెలుసా?

కమలా పండులో విటమిన్ సి, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలేట్, నియాసిన్, పాంటోథెనిక్ యాసిడి, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కమలా పండులోని మెగ్నిషియం రక్తహీనతను అదుపులో ఉంచుతుంది. ఈ కాలంల

కమలా పండులో విటమిన్ సి, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలేట్, నియాసిన్, పాంటోథెనిక్ యాసిడి, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కమలా పండులోని మెగ్నిషియం రక్తహీనతను అదుపులో ఉంచుతుంది. ఈ కాలంలో ఈ పండు దొరుకుతుంది. దీనిలోని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.
 
మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించుటకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. గుండె పట్టేయడం వంటి సమస్యలను తొలగిస్తుంది. ఈ కమలాపండును జ్యూస్ రూపంలో తీసుకుంటే గర్భిణులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండు శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. చర్మసౌందర్యానికి కూడా సహాయపడుతుంది. 
 
పలు రకాల క్యాన్సర్ వ్యాధులను నివారిస్తుంది. అధిక రక్తపోటు వ్యాధిని తగ్గించుటకు మంచిగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలోని లోపలి భాగలను శుభ్రం చేస్తుంది. చర్మం గాయాలుగా ఉన్నప్పుడు ఈ కమలా తొక్కల పొడిని రాసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. దాంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.