శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ivr
Last Modified: సోమవారం, 2 మే 2016 (17:36 IST)

సంపూర్ణ ఆహార విలువల భోజనం తినాలి... ఎలాగంటే... ఇలా...

భోజనం ఎలా చేయాలో ఏవేవి తీసుకోవాలి ఇప్పుడు చాలామందికి కన్ఫ్యూజన్‌గా ఉంటోంది. శారీరక శ్రమ లేకపోవడం ఒకవైపు ఏమి తింటే ఏమి వచ్చిపడుతుందోననే భయం ఇంకోవైపు. వీటితో ఏం తినాలన్నా భయంభయంగా తినేస్తున్నారు. అసలు సంపూర్ణ ఆహార విలువలు కలిగిన ఆహార పదార్థాలు ఉదయం నుం

భోజనం ఎలా చేయాలో ఏవేవి తీసుకోవాలి ఇప్పుడు చాలామందికి కన్ఫ్యూజన్‌గా ఉంటోంది. శారీరక శ్రమ లేకపోవడం ఒకవైపు ఏమి తింటే ఏమి వచ్చిపడుతుందోననే భయం ఇంకోవైపు. వీటితో ఏం తినాలన్నా భయంభయంగా తినేస్తున్నారు. అసలు సంపూర్ణ ఆహార విలువలు కలిగిన ఆహార పదార్థాలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏమేమి తీసుకోవాలో చూద్దాం.
 
ఉదయం పూట 6 గంటలకు గ్లాసు పాలు లేదంటే రాగి జావ తీసుకోవాలి. ఉదయం 8 గంటలకు 4 ఇడ్లీలు లేదంటే దానికి సమానమైన బ్రేక్ ఫాస్ట్ ఏదైనా. 10 గంటలకు పండ్లు లేదా ఓ గ్లాసుడు పండ్ల రసం తీసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలకు 2 కప్పుల అన్నం, కప్పు ఆకు కూర, కప్పు కూర, కప్పు పెరుగు, పచ్చి కూరగాయలు తీసుకోవాలి. సాయంత్రం 4 గంటలకు కప్పు టీ లేదా మొలకెత్తిన శెనగలు కానీ పెసలు కానీ తీసుకోవాలి. 
 
రాత్రి 8 గంటలకు 2 చపాతీలు, అన్నం, పప్పు, రసం తీసుకోవచ్చు. రాత్రి 10 గంటలకు గ్లాసు పాలు తీసుకోవాలి. ఇది సంపూర్ణ ఆహారం చిట్టా. ఐతే ఏ పని చేయకుండా తినడమే పనిగా పెట్టుకుంటే కొవ్వు పేరుకుపోయి సమస్య తలెత్తవచ్చు. కాబట్టి వ్యాయామం కూడా తప్పనిసరి.