శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (15:16 IST)

పిల్లలకు వెన్నను తినిపిస్తే... నాడి వ్యవస్థకు...

నవెన్న తింటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. వెన్న తింటే కొవ్వు పెరుగుతుందనీ, బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇందులో విటమిన్ ఎ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని వైద్య నిపుణులు త

వెన్న తింటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. వెన్న తింటే కొవ్వు పెరుగుతుందనీ, బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇందులో విటమిన్ ఎ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండెను దృఢంగా ఉంచుతుంది. 
 
అంతేకాకుండా వెన్నను ఆహారం ద్వారా తీసుకోవడం వలన త్వరగా కడుపు నిండినట్లు ఉండడంతో పాటు ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీని వలన అధికబరువు సమస్యలు తలెత్తవు. వెన్నలో మంచి కొలెస్ట్రాల్ ఉండడం వలన చిన్నపిల్లలకు ఇది చాలా ఉపయోగపడుతుంది.
 
చిన్నపిల్లలకు రోజూ రెండు స్పూన్ల వెన్న ఇవ్వడం వలన వారి మెదడు, నాడి వ్యవస్థ ఎదుగుదల చాలా మంచిది. చిన్నతనం నుంచి పిల్లలకు తగు మోతాదులో వెన్నను తినడం అలవాటు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. పెద్దలు మాత్రం రోజుకో స్పూన్ వెన్నను ఆహారంలో చేర్చుకుంటే హృద్రోగ వ్యాధులు దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.