నోటి దుర్వాసన తట్టుకోలేకపోతున్నారా..?
నోరు వాసన వస్తుంటే చాలు అవమానంగా ఉంటుంది. ఎవరితో మాట్లాడాలన్నా బిడియపడుతుంటారు. నిజమే కదా. మాట్లడేటపుడు వినేవారికి కూడా అంతే ఇబ్బందిగా ఉంటుంది. ఇలా నోరు ఎందుకు దుర్వాసన వస్తుంటుంది. అందుకు ఏం చేయాలి. నివారణకు మార్గాలేమిటో తెలుసుకుందాం...
సాధారణంగా దంతాలు, నోరు అపరిశుభ్రంగా ఉన్నందువలన నోటి దుర్వాసన వస్తుంది. నోటిలోని చిగుళ్లు ఇన్‌ఫెక్షన్స్ వలన కూడా రావొచ్చు. మసాల పదార్థాలతో తయారుచేసిన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు నోటి దుర్వాసన వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కనుక వీలైనంత వరకు మసాలతో కూడిన ఆహార పదార్థాలు తినడం మానేయండి.. తప్పక ఫలితం ఉంటుంది.
నోరు తడిలేని వారికి కూడా నోటి దుర్వాసన వచ్చును. దీర్ఘకాలిక, శ్వాసకోశ వ్యాధులు, ముక్కుకు సంబంధించిన వ్యాధులు కూడా కారణం కావొచ్చు. పొగాకు నమలడం వంటివి చేస్తే కూడా నోటి దుర్వాసన వచ్చును.
నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలంటే...
నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి. ఆహారం తీసుకున్న తరువాత నీటితో పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి. నాలుకను శుభ్రపరచాలి. కట్టుడు పళ్ళు ఉన్నచో వాటిని క్రమం తప్పక శుభ్ర పరచుకోవాలి. వీలైనంత ఎక్కువగా నీరు తీసుకోవాలి.