రెడ్‌వైన్‌ తాగుతున్నారా? అయితే మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు.....

మంగళవారం, 3 జులై 2018 (11:35 IST)

రెడ్‌వైన్‌ను ఇష్టంగా తాగేవారు ఇకపై జాగ్రత్తగా ఉండాలి. వీలైతే దానిని తాగడం పూర్తిగా మానేయడమే ఆరోగ్యానికి మంచిది. అధిక మోతాదులో రెడ్‌వైన్ తీసుకోవడం వలన క్యాన్సర్, హృద్రగంతో పాటు డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా శుద్ధిచేయని చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ద్రాక్షారసం తాగడం వలన కాలేయం దెబ్బంతింటుంది.
 
ఈ పరిణామాల వలన శరీరంలోని చెడు కొవ్వు శాతం పెరుగుతుందని కూడా తెలియజేశారు. దీనిని తాగడం వలన దీర్ఘకాలిక వ్యాధులతో పాటు చర్మ సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండడం వలన మెుటిములు కూడా ఏర్పడే అవకాశముంది.
 
చర్మం కళను కోల్పోతుందని డాక్టర్ ఇసాబెల్ షార్కర్ తెలిపారు. రెడ్‌వైన్ తాగడం వలన కళ్లకింద నల్లటి వలయాలు కూడా ఏర్పడే ప్రమాదముంది. మెుటిమలు చర్మంపై గల మృతుకణాల వలన రంధ్రాలు ఏర్పడుతాయి గనుక సాధ్యమైనంతవరకు రెడ్‌వైన్‌ను తాగకపోవడమే మంచిదని పరిశోధనలో తెలియజేశారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ముఖానికి బాదం పప్పుల పేస్టును రాస్తే?

చర్మసౌందర్య సాధనాలలో బాదంను విరివిగా వాడుతారు. చర్మకాంతిని సంతరించుకోవాలంటే.. రాత్రి ...

news

గ్రీన్ కాఫీ ఎక్కువగా తీసుకుంటే?

గ్రీన్ కాఫీ తాగడం వలన ఆరోగ్య ప్రయోజానాలను పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ...

news

నెలసరి సమయంలో చిప్స్, కేక్స్, కూల్‍డ్రింక్స్ తీసుకుంటే?

మహిళలు నెలసరి సమయంలో పోషకాహారం తీసుకోవాలి. నెలసరి సమయంలో తీసుకునే ఆహారం గర్భసంచిని ...

news

అల్సర్ వ్యాధితో బాధపడుతుంటే... ఇలా చేస్తే సరి...

కొంతమంది అల్సర్‌ వ్యాధితో చాలా బాధపడుతుంటారు. ఇది గ్యాస్టిక్ సమస్యలే అనుకుని అలాగే ...