అలాంటి వాళ్లకి బెల్లం చక్కటి పరిష్కార మార్గం...

jaggery
సిహెచ్| Last Modified గురువారం, 6 డిశెంబరు 2018 (17:16 IST)
భారతీయ వంటకాల్లో సాధారణంగా ఉపయోగించే పదార్థం బెల్లం. ఆహారాలకు స్వీట్‌నెస్‌ని ఇచ్చే బెల్లంలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. చెరకు నుంచి తయారు చేయబడే బెల్లం అందరికీ అందుబాటులో ఉండే పదార్థం. షుగర్ పేషంట్స్ తీపికి దూరంగా ఉండాలి. అయితే ఆర్గానిక్ బెల్లం తీసుకోవడం వల్ల ఎలాంటి హాని కలుగదు. అలాగే డైజెషన్ సమస్యలు నివారించడానికి కూడా బెల్లంను తీసుకోవచ్చు. అలాగే బెల్లం రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఐతే బెల్లం తీసుకోవడం ఆరోగ్యకరం అని చెప్పడానికి చాలా కారణాలున్నాయి. అవేంటో చూద్దాం.

1. బెల్లంను కేవలం స్వీట్నెస్ కోసమే కాదు.. ఇందులో చాలా విభిన్నమైన ఫ్లేవర్ ఉంటుంది. అది వంటకాలకు మంచి రుచిని ఇస్తుంది. అదే చక్కెర అయితే కేవలం స్వీట్నెస్‌ని మాత్రమే ఇస్తుంది. బెల్లం స్వీట్నెస్‌తో పాటు.. మంచి రుచిని కూడా అందిస్తుంది.


2. ఇది జీర్ణక్రియకు, శ్వాసనాళ సమస్యలకు చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థలో పేరుకున్న మలినాలను తొలగించి, కాన్ట్సిపేషన్‌ను నివారిస్తుంది. శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగించడానికి కూడా సహాయపడుతుంది. తక్షణ శక్తి బెల్లంలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి సహాయపడతాయి.

3. మధుమేహంతో బాధపడేవాళ్లు చక్కెర తినలేరు కాబట్టి బెల్లం తీసుకోవచ్చు. జీర్ణక్రియకు భోజనం తర్వాత కొంచెం బెల్లం తీసుకోవడం వల్ల డైజెస్టివ్ ఎంజైమ్స్‌కి శక్తినిచ్చి త్వరగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. ఇది అసెంటిక్ యాసిడ్‌లా మారి జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.

4. హెవీ మీల్ తీసుకున్నప్పుడు బెల్లం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడకుండా ఈజీగా జీర్ణమవుతుంది. మినరల్స్ బెల్లంలో చాలా మినరల్స్ ఉంటాయి. ఐరన్ లోపంతో బాధపడేవాళ్లకు బెల్లం చక్కటి పరిష్కారం. కాబట్టి రెగ్యులర్ డైట్లో బెల్లం చేర్చుకుంటే సరిపోతుంది. చక్కెరతో పోల్చితే బెల్లంలో చాలా ప్రయోజనాలు దాగున్నాయి. రక్త శుద్ధికి క్లెన్సింగ్ గుణాలతో పాటు రక్తాన్ని శుద్ధిపరిచే గుణాలు కూడా బెల్లంలో ఉన్నాయి.

5. అలాగే రక్తం ఉత్పత్తి చేయడానికి బెల్లం సహాయపడుతుంది. ఎర్రరక్త కణాలు తక్కువగా ఉన్నవాళ్లు, గర్భిణీ స్త్రీలు బెల్లం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కీళ్ల నొప్పులు బెల్లం తీసుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే కండరాలను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి ఇది సహకరిస్తుంది.

6. చర్మానికి, జుట్టుకి బెల్లంలో బ్లడ్ ప్యూరిఫైరింగ్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఇది జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది. అలాగే మొటిమలు, మచ్చలు సమస్యను తగ్గించి, చర్మానికి నిగారింపు తీసుకురావడానికి సహకరిస్తుంది.

7. రుతుక్రమ సమస్యలకు ముఖ్య కారణం శరీరానికి కావాల్సిన మోతాదులో మినరల్స్ అందకపోవడమే. బెల్లంలో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మహిళలు దీన్ని రెగ్యులర్ డైట్లో చేర్చుకోవటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.దీనిపై మరింత చదవండి :