Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్య ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ దీన్ని ఒక ముక్క తినిపించాలి...

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (21:58 IST)

Widgets Magazine
jaggery

బంగారు రంగుతో చూడటానికి అందంగా, తియ్యగా, మంచి వాసనతో ఉండే బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా మందులలో వాడుతారు. సాధారణంగా చెరకు రసం నుంచి బెల్లాన్ని తయారుచేస్తారు. తాటి నుంచి కూడా బెల్లం తయారవుతుంది. బెల్లంలో పంచదార లాగా పెద్దగా రసాయనాల వాడకం ఉండదు. పైగా ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి వంద గ్రాముల నుంచి 350 గ్రాముల శక్తిని, 95 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 55 గ్రాముల కాల్షియం, 40 గ్రాముల పాస్పరస్, 2.6 మిల్లీ గ్రాముల ఐరన్ బెల్లంలో దొరుకుతుంది. 
 
చక్కెర కంటే బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. తియ్యటి పదార్థాలకు చక్కెర కన్నా బెల్లం మేలు. రోజూ బెల్లం ముక్క తినే వారిలో రక్తశుద్ధి జరిగి వ్యాధులు తగ్గుముఖం పడతాయి. లివర్ లోని వ్యర్థాలను బయటకు పంపించి దాని పనితీరును మెరుగుపరుస్తుంది. ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచి జీర్ణసంబంధింత సమస్యలు రాకుండా చూస్తుంది. 
 
బెల్లంలోని యాంటీ యాక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, రోగనిరోధక శక్తిని పెంచి ఫ్రీ రాడికల్స్ ఇన్ఫెక్షన్లను వ్యతిరేకంగా పోరాడుతాయి. బెల్లంలో పుష్కలంగా లభించే ఐరన్, ఫ్లోరిక్ యాసిడ్‌లు మహిళల్లో రక్తహీనతను నివారిస్తాయి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. బెల్లం గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. బెల్లం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉండి జ్ఞాపకశక్తి బాగా పనిచేస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వాడికి డబ్బు సాయం చేసి ఇలా అయిపోయామేమిటి?

ఎవరికైనా మనం సహాయం చేసేటపుడు ప్రతిఫలం ఆశించకుండా చేయాలి. వారు ఎప్పుడైనా ఏమైనా మనకు సహాయం ...

news

10 రూపాయలతో మీ పిల్లల ఆరోగ్యం పదిలం...

రాగులను ఫింగర్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అని పిలుస్తారు. రాగి వార్షిక ధాన్యపు పంట. ...

news

ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. రాత్రిపూట పెరుగు వేసుకోకూడదా?

మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు విటమిన్ ''సి'' ఉన్న సహజమైన ఆహారం తీసుకోవడం మంచిది. ...

news

పిల్లల్లో డిప్రెషన్‌కు కారణాలేంటి?

డిప్రెషన్‌ అంటే.. ఇదో మానసిక సమస్య. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో బాధపడటం, ఒంటరిగా ...

Widgets Magazine