వామ్మో పిక్క పట్టింది.. ఏం చేయాలి?

pains
సిహెచ్| Last Modified శుక్రవారం, 7 ఆగస్టు 2020 (22:54 IST)
నిద్ర పోతూ వుంటాం. అకస్మాత్తుగా కొందరిలో కాలి కండరాలు పట్టేస్తాయి. పిక్క పట్టేస్తుందని అంటుంటారు. ఈ పిక్క పట్టిందని ప్రాణం లేచిపోయినట్లనిపిస్తుంది. కాలి కండరాలు ఇలా పట్టేసినప్పుడు ఈ క్రింది విధంగా చేస్తే ఉపశమనం లభిస్తుంది.

1. త‌గినంత‌ పొటాషియం మన శరీరంలో లేక‌పోయినప్పుడు ఇలా జ‌రుగుతుంది. కనుక పొటాషియం ఎక్కువ‌గా ఉండే అర‌టిపండ్లు త‌దిత‌ర ఆహారాల‌ను తీసుకుంటే ఈ సమస్య రాకుండా వుంటుంది.

2. తొడ కండ‌రాలు, కాలి పిక్క‌లు ప‌ట్టేసిన‌ప్పుడు ఆ ప్ర‌దేశంలో ఐస్ గ‌డ్డ‌లు క‌లిగిన ప్యాక్‌ను పెట్టుకోవాలి. అలా నొప్పి త‌గ్గేంత వ‌ర‌కు చేస్తే స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

3. మరో చిట్కా ఏంటంటే... కొబ్బ‌రినూనె, ఆలివ్ ఆయిల్‌, ఆవ నూనెల‌ను స‌మ‌భాగాల్లో తీసుకుని మిశ్ర‌మంగా చేసి దాన్ని వేడి చేసి ఆ మిశ్ర‌మాన్ని స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాస్తూ సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. దీంతో కండరాల నొప్పి తగ్గుతుంది.

4. ఇంకా... కొబ్బ‌రినూనె కొద్దిగా తీసుకుని దాంట్లో కొన్ని లవంగాలు వేసి ఆ మిశ్ర‌మాన్ని వేడి చేయాలి. దీన్ని గోరువెచ్చ‌గా ఉన్న‌ప్పుడు స‌మ‌స్య ఉన్న ప్రాంతంలో రాస్తే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.దీనిపై మరింత చదవండి :