చర్మవ్యాధులకు సరైన ఔషధం శెనగలు

మంగళవారం, 29 నవంబరు 2016 (13:16 IST)

bengalgram

శెనగలను సంస్కృతంలో చణక అంటారు. శెనగలు మూడు రకములు. 1.జాతి శెనగ 2.హైబ్రీడు శెనగ 3.తెల్ల శెనగ. ఇవి మిక్కిలి లావుగా ఉండడమే కాకుండా ఎక్కువ రేటును కలిగి ఉంటుంది. దీని ఆకులు చిన్న ఆకారంలో ఉంటుంది. ఈ శెనగ ఆకుల నుంచి పులుసు (ఆమ్లము) తయారుజేసి పైత్యమకు మందుగా వాడుతారు. శెనగలలో ఐరను, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణకావటానికి 3 గంటల సమయం పడుతుంది.
 
శెనగలలో చలువ చేసే గుణాలు ఉంటుంది. ఇవి రక్త దోషములను పోగొట్టి బలమును కలిగిస్తుంది. శెనగలు సులభముగా జీర్ణం అవుతుంది. శెనగాకును ఆహారంగా వాడటం వల్ల పిత్తరోగములు నశిస్తుంది. ఇవి చిగుళ్ల వాపును తగ్గించగలవు. కడుపు ఉబ్బరము కలిగిస్తుంది. 40 సంవత్సరాలు దాటిన కొందరు పురుషులు శీఘ్రస్కలన మవుతుందని బాదపడుతుంటారు. అలాంటి వారు రెండు చెంచాల శెనగపిండిలో కొంచెం ఖర్చూరం, పాలపిండి కలిపి ప్రతిరోజూ 15 రోజుల పాటు రోజుకు రెండుసార్లు తీసుకుంటే శీఘ్రస్కలనము తగ్గడమే కాకుండా బలాన్ని కూడా ఇస్తుంది.
 
గజ్జి, చిడుము, తామర గల వారు ప్రతిరోజూ శెనగపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తుంటే ఆ వ్యాధులు మటుమాయమవడమే కాకుండా దేహమును, ముఖమునకకు కాంతి కలిగిస్తుంది. మొటిమలు నశిస్తుంది. షాంపుకు బదులు ప్రతిసారీ శెనగపిండితో తలను రుద్ది స్నానం చేస్తే వెంట్రుకలు పెరుగుతాయి. అంతేకాకుండా శిరోజాలు పట్టుకుచ్చువలె కాంతతివంతములై వాని కుదుళ్లు గట్టిగా ఉంటాయి. మూత్ర వ్యాధులు ఉన్నవారు శెనగల వాడటం తగ్గిస్తే మంచిది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మీ చర్మం కాంతివంతగా మారాలి.. అయితే తేనె వాడండి...!

తేనెలో తియ్యదనంతో పాటు అనేక పోషక, ఔషధ గుణాలు ఉన్నాయి. తేనెను సంస్కృతంలో మధువు అంటారు. ...

news

ఏటీఎం సెంటర్లకు వెళ్ళొచ్చారా? ఐతే భోజనం చేసేందుకు ముందు చేతులు వాష్ చేసుకోండి..

భోజనానికి ముందు.. బాత్రూమ్ వినియోగం తర్వాత చేతులు కడుక్కోవడం సహజం. చేతులు మురికిగా మారిన ...

news

చలిచలిగా చలికాలం... మంచి మూడ్‌లోకి రావాలంటే గోరువెచ్చని వేడినీటి స్నానం

బిజీ లైఫ్. క్షణం తీరకలేని జీవితం. అలసటతో ఇంటికి చేరగానే హాయిగా వేడినీటితో వీలైనంత ...

news

నవంబరులోనే చంపేస్తున్న చలిపులి... ముక్కు దిబ్బడ, గొంతులో గరగర... ఇవే చిట్కాలు...

నవంబరు నెలలోనే చలి పులి చంపేస్తుంది. చలికాలంలో ముఖ్యంగా డిసెంబరు, జనవరి నెలల్లో మనుషుల్లో ...